ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నందకిషోర్ ఇప్పుడు హీరోగా మారుతున్నారు. సినిమా పేరు ‘నరసింహపురం’. టైటిల్ వింటుంటేనే ఆసక్తికరంగా అనిపిస్తోంది కదూ. ఈ సినిమాలో నందకిషోర్ గెటప్ కూడా ప్రేక్షకులకు షాకింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే.. ఎప్పుడూ ఆయన్ని టీవీ సీరియల్స్ లో చాలా కూల్ గా చూసి ఉన్న వీక్షకులు.. తెరపై ఆయన గెటప్ కు ఆశ్చర్య పోతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నెవర్ బిఫోర్ గెటప్ లో రివీల్ అవుతున్న నందకిషోర్ కి ఈ సినిమా చాలా స్పెషల్. ఇక విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఇటీవల నరసింహపురం సినిమా టీజర్ విడుదలైంది.
గీత గౌరవ్ సినిమాస్ పతాకం పై పి.ఆర్. క్రియేషన్స్ సమర్పణలో టీ.ఫణిరాజ్ గౌడ్ , నందకిషోర్ థూళిపాళ సంయుక్త నిర్మాణంలో శ్రీరాజ్ భళ్ళా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ నరసింహపురం. కళ్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, అరవింద సమేత ఫేమ్ రంగధామ్, రవివర్మ, సంపత్ ఫణిరాజ్, స్వామి, శ్రీకాంత్ ఫణిరాజ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమా నందకిషోర్ కు హీరోగా ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.
Also Read : ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ వదిలేది అప్పుడే.. !