అందాల తార నయనతార.. తన సినిమాల గురించి కన్నా.. తన ప్రేమ వ్యవహారం గురించే ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. నయనతార, విఘ్నేష్ శివన్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే విషయం తెలిసిందే. వీరి పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఇప్పటి వరకు పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం ప్రకటించలేదు. పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఇంకా సమయం ఉంది. ఆ టైమ్ వచ్చినప్పుడే మేము చెబుతాం అంటూ సమాధానం దాటవేసేవారు. ఆమధ్య ఈ జంట పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు రాగా.. వాటిని విఘ్నేష్ కొట్టిపారేశాడు.
నయనతారతో పెళ్లి గురించి విఘ్నేష్ గతంలో చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ విఘ్నేష్ ఏం చెప్పాడంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదని.. కెరీర్ పరంగా ఇద్దరం చాలా బిజీగా ఉన్నామని చెప్పాడు. అంతేకాదు.. తామిద్దరికీ డేటింగ్ లైఫ్ మీద బోర్ కొట్టినప్పుడే పెళ్లి చేసుకుంటామని క్లారిటీ ఇచ్చాడు. అయితే తాజాగా మరోసారి విఘ్నేష్ తన పెళ్లి గురించి స్పందించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో నెటిజన్లతో ముచ్చటించారు విఘ్నేష్.
ఓ నెటిజన్ నయన్-విఘ్నేష్ ల పెళ్లి గురించి అడిగాడు. ”మీరు.. నయన్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు..? మీ పెళ్లి కోసం చాలా ఎదురుచూస్తున్నాం అని ఓ ఫాలోవర్ అడగ్గా.. దానికి విఘ్నేష్.. పెళ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఆ శుభకార్యానికి డబ్బు ఆదా చేస్తున్నానని బదులిచ్చాడు. అలానే కరోనా త్వరగా వెళ్లిపోతే పెళ్లి చేసుకోవడానికి కుదురుతుందని పరోక్షంగా చెప్పాడు. దీంతో వీరిద్దరూ పెళ్లికి సిద్ధంగా ఉన్నారని చెప్పకనే చెప్పాడు విఘ్నేష్. మరి.. ఈ సంవత్సరం చివరిలో కానీ.. వచ్చే సంవత్సరంలో కానీ.. నయన్ – విఘ్నేష్ పెళ్లి చేసుకుంటారేమో చూడాలి.
Must Read ;- హీరోయిన్ నయనతార పయనం ఎటువైపు?











