తాజాగా విజయ్ దేవరకొండ అరుదైన రికార్డును సొంతం చేస్తుకున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో కోటీ మంది ఫాలోవర్స్ తో కొత్త రికార్డును విజయ్ నెలకొల్పారు. దక్షిణ భారతదేశ సినీరంగానికి చెందిన హీరోలలో కోటి మంది ఫాలోవర్స్ ఉన్న ఏకైక నటుడిగా అరుదైన ఘనత విజయ్ కి దక్కింది.‘1 క్రోర్ ఇన్ స్టా రౌడీస్’’ అనే శీర్షికతో అభిమానుల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. సోషల్ మీడియాలో తరచూ తనదైన శైలిలో క్రియేటివ్ గా పోస్ట్ లు పెడుతూ అందరికి ఎంతో దగ్గరైన విజయ్ 10 మిలియన్ల ఫాలోవర్స్ పట్ల ఎనలేని ఆనందాన్ని వ్యక్తంచేశారు.
Must Read ;- బిగ్ బాస్ లో విజయ్ దేవరకొండ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడో తెలుసా.?