సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్ లైన్. మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు అనూహ్యమైన స్పందన లభించింది. అటు విజయ్ అభిమానులు, ఇటు పూరి అభిమానులు ఎప్పుడెప్పుడు లైగర్ మూవీ రిలీజ్ అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. త్వరలో హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. లైగర్ మూవీ ఓటీటీలో రానుందని.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ మరియు అన్ని భాషల శాటిలైట్ రైట్స్ కోసం ఓ ప్రముఖ సంస్థ ఏకంగా 200 కోట్ల రూపాయల భారీ ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది భారీ ఆఫరే.. విజయ్ సినిమాకు కానీ.. పూరి సినిమాకు కానీ ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాలేదు. అందుచేత ఇది మంచి ఆఫరే అంటున్నారు. అయితే.. ప్రచారంలో ఉన్న వార్తల పై పూరి జగన్నాథ్ స్పందించలేదు కానీ.. విజయ్ దేవరకొండ స్పందించారు. ఇంతకీ విజయ్ ఏమన్నారంటే.. ఇది చాలా తక్కువ. నేను థియేటర్లలో ఇంకా ఎక్కువ చేస్తాను అని ట్వీట్ చేశాడు.
దీన్ని బట్టి వీడీ తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు అర్థం అవుతోంది. అలాగే లైగర్ మూవీ ఓటీటీ రిలీజ్ కాదని.. థియేటర్లోనే రిలీజ్ అవుతుందని చెప్పకనే చెప్పారు విజయ్ దేవరకొండ. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తుంది. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మరి.. విజయ్ చెప్పినట్టుగా థియేటర్ లో లైగర్ 200 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుందేమో చూడాలి.
Must Read ;- రిలీజ్ కాకుండానే రికార్డ్ క్రియేట్ చేసిన లైగర్