బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కు రీమేక్. ఈ సినిమా అమీర్ ఖాన్ కు బాగా నచ్చడంతో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉంది. ఈ పాత్రను తమిళ స్టార్ విజయ్ సేతుపతితో చేయించాలి అనుకున్నారు. అమీర్ ఖాన్ మూవీలో నటించే అవకాశం వస్తే.. ఎవరు మాత్రం నో చెబుతారు.? విజయ్ ని కాంటాక్ట్ చేయడం.. ఈ సినిమాలో నటించేదుకు విజయ్ సేతుపతి వెంటనే ఓకే చెప్పడం కూడా జరిగింది.
అయితే.. ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం విజయ్ను 25 కిలోల బరువు తగ్గాలని చెప్పారట. దీనికి విజయ్ సేతుపతి కూడా ఓకే చెప్పాడట కానీ.. అనుకున్నంతగా విజయ్ సేతుపతి బరువు తగ్గలేదని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ కారణం చేతనే విజయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని తెలిసింది. అయితే.. ఇప్పటి వరకు దీనికి గురించి అమీర్ ఖాన్ కానీ, విజయ్ సేతుపతి కానీ స్పందించలేదు.
నిజంగానే విజయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారా.? ఇదే కనుక నిజమైతే.. విజయ్ సేతుపతి చేయాల్సిన పాత్రను ఎవరితో చేయిస్తారు అనేది తెలియాల్సివుంది. అద్వైత్ చందన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సంవత్సరం చివరిలో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. తన ప్రతి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసే అమీర్ ఖాన్ ఈ సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.
Must Read ;- సలార్ తో తలపడనున్న విజయ్ సేతుపతి?