తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందిే. తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరిట ఇప్పటికే పార్టీని ప్రకటించిన విజయ్… ఆదివారం తన తొలి బహిరంగ సభను గ్రాండ్ గా నిర్వహించారు. లక్షలాదిగా తరలివచ్చిన తన అబిమానులను చూస్తూ భావోద్వేగంతో మాట్లాడిన విజయ్… తన పార్టీ ప్రస్థానం ఎలా సాగుతుందన్న విషయాన్ని విస్పష్టంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తాను ఎలాంటి రాజకీయాలు చేస్తానన్న విషయాన్ని ప్రస్తావిస్తూనే… ఎలాంటి విధానాలకు దూరంగా ఉంటానన్న విషయాన్ని కూడా విజయ్ ఒకింత గట్టిగానే వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీలో రాజకీయం చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పరోక్షంగా ప్రస్తావించిన విజయ్… జగన్ చేసినటువంటి రాజకీయం తానుచేయనంటూ విజయ్ చెప్పడం గమనార్హం. ఈ దిశగా విజయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో సీఎంగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో వందలాది మంది చనిపోయారంటూ జగన్ కుటుంబం వాదించిన సంగతి తెలిసిందే. అలా చనిపోయిన వారందరినీ పరామర్శిస్తానని, అందుకోసం ఓదార్పు యాత్ర చేస్తానని జగన్ చేసిన ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ ససేమిరా అన్నది. అంతే… కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్ వైసీపీ పేరిట వేరు కుంపటి పెట్టుకుని ఓదార్పు యాత్ర చేశారు. అయినా 2014లో ఆయనకు ఏపీ ప్రజలు అధికారం ఇవ్వలేదు. ఆ తర్వాత ప్రజా సంకల్ప యాత్ర పేరిట మరో యాత్రకు శ్రీకారం చుట్టిన జగన్ 2019 ఎన్నికలకు సన్నద్ధం అయ్యారు. సరిగ్గా 2019 ఎన్నికలకు కొన్ని రోజుల ముందుగా తన సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు గురైన అంశాన్ని రాజకీయంగా వాడుకున్న జగన్… ఎలాగోలా 2019 ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత కూడా ఎక్కడ ఎవరు చనిపోయినా పరామర్శ పేరిట జగన్ వాలిపోతున్న వైనంపై వైరివర్గాలు ఇప్పటికీ సెటైర్లు వేస్తూనే ఉన్నాయి.
ఈ దిశగా జగన్ చేస్తున్న రాజకీయాలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెర లేపాయి. ఈ క్రమంలోనే జగన్ తరహా రాజకీయాలు తెలుసుకున్న విజయ్… తన రాజకీయ ప్రస్థానంలో జగన్ మాదిరిగా శవ రాజకీయాలు చేయబోనంటూ సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా జగన్ పై లెక్కలేనన్ని కుసులు ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించిన విజయ్,… అన్ని కేసులు ఉన్న వారే సీఎం పీఠాలపై కూర్చుంటూ ఉంటే…తానెందుకు ముఖ్యమంత్రి కాలేనని కూడా వ్యాఖ్యానించారు. మొత్తంగా జగన్ రాజకీయాల తీరును, ఆయనపై ఉన్న కేసులను ప్రస్తావిస్తూ విజయ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో తెగ వైరల్ అవుతున్నాయి. జగన్ రాజకీయాల తీరును ప్రశ్నిస్తూ మ విజయ్ చేసిన వ్యాఖ్యల వీడియోలను చూసిన జనం… తనకు మాత్రమే సాధ్యమైన కుటిల రాజకీయాలతో ఎలాగూ తెలుగు ప్రజల చేతిలో నిత్యం దూషణలు ఎదుర్కోవడం సరిపోలేదేమో… ఇప్పుడు ఏకంగా పక్క రాష్ట్రాల ప్రజలు, నేతలతోనూ జగన్ తిట్టించుకుంటున్నారని సెటైర్లు వేస్తున్నారు.