ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కోసం ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు శరత్ చంద్రా రెడ్డి బలి కాబోతున్నాడా.?? శరత్ చంద్రా రెడ్డి కేంద్రంగా ఏపీ, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా కొత్త రాజకీయం మొదలవబోతోందా.? అంటే కొత్త కథనం చెబుతున్నారు ఏబీఎన్ ఎమ్ డీ రాధా కృష్ణ..
డిల్లీ లిక్కర్ స్కామ్ లో హెటెరో ఫార్మా గ్రూప్ కి చెందిన శరత్ చంద్రా రెడ్డిది కీలక పాత్ర అని చెబుతోంది సీబీఐ, ఈడీ. ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేసింది.. విచారణ చేస్తోంది.. శరత్ చంద్రా రెడ్డిని అడ్డు పెట్టుకొని బీజేపీ నేతలు జగన్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీ వాల్ తోపాటు ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితని అడ్డంగా బుక్ చేసేందుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రా రెడ్డిని అప్రూవర్ గా మారాలని జగన్ కి షరతు పెట్టారట బీజేపీ నేతలు.. ఈ అంశంలో తనను వదిలేయాలని, తనకు సంబంధం లేదని, వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి సేఫ్ గా ఉంటే చాలని కోరారట జగన్.. 2024లో అధికారంలోకి వస్తే… తాను ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీకి ఎలా అయితే సహకరిస్తున్నానో, అదే రీతిలో అన్ కండిషనల్ గా సహకరిస్తానని తెలిపారట జగన్.. తనను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోకి లాగవద్దని సూచించారట..
లోక్ సభలో మరోసారి పాగావేసి హ్యాట్రిక్ సాధించాలని కలలు కంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వరసగా రెండుసార్లు గెలిచిన తర్వాత అధికార పార్టీపై కొంత వ్యతిరేకత ఉండడం సహజం. కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ దీనిని క్యాష్ చేసుకోవడంలో విఫలమవుతుండడం బీజేపీకి కలిసి వస్తోంది.. అధికారంలోకి రావడానికి ఏ చిన్న అంశాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధంగా లేదు కాషాయ దళం.. అందుకే, అన్ని రాష్ట్రాలలోనూ లెక్కలు సరిచేసకుంటోంది బీజేపీ.. 2014, 19లో సాధించిన ఏక పక్ష విజయాలు ఈసారి సాధ్యం కాదని లెక్కలు కట్టుకున్న కాషాయ దళం ప్లాన్ బీ రెడీ చేసుకుంటోంది.. ఇటు దక్షిణాదిలో కర్నాటక కాంగ్రెస్ పరం అయ్యే సంకేతాలు అందుతున్నాయి.. దీంతో, నార్త్ లో కేజ్రీ వాల్ ని, సౌత్ లో కేసీఆర్, స్టాలిన్ ని టార్గెట్ చేశారని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు..
కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత డిల్లీ లిక్కర్ స్కామ్ కేసుని మరింత వేగంగా విచారణ చేయాలని భావిస్తోందట.. కన్నడ ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తే.. లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రా రెడ్డితో పొలిటికల్ గేమ్ ఆడే యోచనలో ఉందట బీజేపీ..
అయితే, తాను అప్రూవర్ గా మారనని, తాను ఎలాంటి తప్పు చేయలేదని వాదిస్తున్నారట శరత్ చంద్రా రెడ్డి. రాజకీయాలకు తాను బలయ్యానని వాపోతున్నారట.. తాను అప్రూవర్ గా మారితే ఒక ఇన్వెస్టర్ గా తన క్రెడిబులిటీ దెబ్బ తింటుందని, ఇతర పెట్టుబడి దారులు తనను, తన కుటుంబాన్ని విశ్వసించరని చెబుతున్నారట విజయసాయి రెడ్డి అల్లుడు..
గత కొంతకాలంగా వైసీపీలో విజయ సాయి రెడ్డి సైలెంట్ గా ఉండడానికి ఈ కేసు కూడా కొంత కారణం అయి ఉండవచ్చని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకలు.. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, రాబోయే రోజుల్లో ఈ కేసులో ఎలాంటి ట్విస్టులు, టర్న్ లు చోటు చేసుకుంటాయో చూడాలి..










