తెలంగాణ కాంగ్రెస్ తన ప్రచార బాధ్యతలను ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే అన్నీ జిల్లాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్ .. రాములమ్మ చేరికతో పార్టీకి అదనపు శక్తి చేకూరింది.
తెలంగాణ ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్ది కాంగ్రెస్ వ్యూహాలను మార్చుకుంటుంది. ప్రచారంలో అన్నీ పార్టీల కన్నా.. కాంగ్రెస్ ముందుంది అన్నది సర్వేలు చెబుతున్న సత్యాలు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ అమ్ముల పొదలో మరో ప్రచార హస్తం వచ్చి చేరింది. ఆ అస్త్రమే తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి. బీజేపీలో సముచిత స్ధానం కల్పించకపోగా.. కనీసం టికెట్ కూడా ఇవ్వకుండా అవమానించారని.. విజయశాంతిని ఆ పార్టీని వీడి.. పూర్వాశ్రమైన కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన విజయశాంతికి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కీలక పదవులు అప్పగించారు.
ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ముందుంది. ప్రచార హోరులో దూసుకుపోతున్న కాంగ్రెస్ కు మరో అస్త్రంలా విజయశాంతి కానున్నది. ఆమెకు ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కో-ఆర్డినేటర్ పదవిని అప్పగించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు నూతన ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటికే సర్వేలన్నీ కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని చెబుతుంటే.. మరోవైపు విజయశాంతి చేరిక.. అదనపు శక్తిని చేకూర్చనున్నది. అంతేకాక తెలంగాణలో అన్నీ జిల్లాలో పట్టున్న విజయశాంతి.. కాంగ్రెస్ విజయంలో కీలక భూమికను పోషించనున్నది.
మరోవైపు బీఆర్ఎస్.., బీజేపీ చీకటి ఒప్పందాలు.., రహస్య రాజకీయాల పొత్తులపై తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చాయి. ఇంకోవైపు కాంగ్రెస్ రోజురోజుకు పుంజుకుంటుంది. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కలిసొచ్చే ప్రతి అంశంపై నిశితంగా పరిశీలించుకుంటూ.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనే చెప్పాలి.