సమయం దొరికేతే చాలు ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించే విజయసాయి రెడ్డి.. ఈసారి ట్రెండింగ్ టాపిక్ తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు విగ్రహాలు, దేవాలయాలు చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో గుళ్ల గురించి చంద్రబాబును దుయ్యబట్టారు. టీడీపీని నాశనం చేసింది చంద్రబాబు అన్నట్లుగా విమర్శించారు.
అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి అడ్డంగా ఉన్నాయని విజయవాడలో 39 గుళ్లను నేలమట్టం చేశాడు. ఇప్పుడు అధికారం కోసం ఆలయాలను కూల్చి అరాచకం సృష్టించాలని కుట్రలు చేస్తున్నాడు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఏర్పడిన పార్టీని Temples Demolition Party గా దిగజార్చాడు. పతనం ఇంతటితో ఆగదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 9, 2021
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అడ్డువచ్చిన గుళ్లను కూలగొట్టారని, ఇప్పుడేమో అధికరం దక్కించుకోవడానికి ఏకంగా గుళ్లను కూల్చి విధ్వేషాలు రెచ్చగొట్టి అరాచకం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలుగు వాడి ఆత్మగౌరవం పేరిట పెట్టిన పార్టీ టీడీపీ అనీ.. కానీ నేడు అది గుళ్లను ధ్వంసం చేసే పార్టీగా మారిందని దుయ్యబట్టారు. TDP-Temples Demoliొion Party గా మారిపోయిందని ట్విట్టర్ వేదికగా ప్రతిపక్ష పార్టీపై విరుచుకుపడ్డారు.
Must Read ;- చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లో రామతీర్థం విగ్రహ ధ్వంసం: విజయసాయి రెడ్డి