పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న నాలుగో విడత ఎన్నికల్లో హింస చెలరేగింది. బెంగాల్‌లోని కూచ్ బిహార్‌లో అల్లర్లను అదుపు చేసేందుకు సీఐఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిలిగురిలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ ఉండగా, కూచ్ బిహార్ లో విషాధకరమైన సంఘటన జరగడంపై మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజలు బీజేపీని ఆదరించడాన్ని మమతా బెనర్జీ జీర్ణించుకోలేకపోతున్నారంటూ ప్రధాని మోడీ దుయ్యబట్టారు.
కఠిన చర్యలు తప్పవు
కూచ్ బిహార్ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఇలాంటి హింసాత్మక విధానాలను అనుమతించేది లేదని మోడీ తెగేసి చెప్పారు. హింసను ప్రేరేపించడం, భద్రతా దళాలపై జనాలను రెచ్చగొట్టడం, పోలింగ్ ప్రక్రియకు భంగం కలిగించడం వంటి చిట్కాలు మిమ్మల్ని కాపాడలేవని మోడీ హెచ్చరించారు. బలవంతపు వసూళ్ల నుంచి బెంగాల్‌కు త్వరలోనే విముక్తి కలగబోతోందని ప్రధాని మోడీ చెప్పారు. సిండికేట్, కట్ మనీ నుంచి విముక్తి పొంది నూతన బెంగాల్ ఆవిష్కృతం కాబోతోందన్నారు.
Must Read ;- ఓటేసిన 15 కోట్ల మంది.. మూడో విడత భారీగా పోలింగ్