వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వైసీపీ శ్రేణులు.. ప్రత్యేకించి జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలిగే నేతలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్న తీరు కలకలం రేపుతోంది. తాజాగా జగన్ సొంత బాబాయి, టీటీడీ తాజా మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కుటుంబం సాగిస్తున్న ఓ అక్రమ మైనింగ్ దందాకు సంబంధించిన వీడియో ఒకటి సోసల్ మీడియాలో కలకలం రేపుపుతోంది. ఓ గిరిజనుడితో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి భాగస్వామి లవ కుమార్ రెడ్డి ఫోన్ లో జరిపిన జరిపిన యాజిటీజ్ గా బయటకు వచ్చేసింది. ఇప్పుడీ వీడియో కలకలం రేపుతోంది.
లేటరైట్ పేరుతో బాక్సైట్
తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో బాక్సైట్ ఖనిజ నిల్వలు భారీ ఎత్తున ఉన్న సంగతి తెలిసిందే. గతంలో వీటి తవ్వకాలకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా.. మావోయిస్టులు, గిరిజనుల ప్రతిఘటనలతో పలుమార్లు ఈ తవ్వకాలు పతాక శీర్షికలెక్కిన సంగతి తెలిసిందే. వెరసి బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వాలు విధించిన నిషేధం ఇప్పుడూ అమల్లో ఉంది. అయినా కూడా బాక్సైట్ పేరు చెప్పకుండా.. లేటరైటో, లేదంటే ఇంకేదో పేరు చెప్పి నేతల కుటుంబాలు అక్రమంగా బాక్సైట్ తవ్వకాలను సాగిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తవ్వకాలపై ఇప్పటికీ గిరిజనుల నుంచి నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
ఫోన్ సంభాషణతో బుక్కై..
ఇటాంటి నేపథ్యంలో మన్యంలోని బాక్సైట్ ఖనిజంపై వైవీ సుబ్బారెడ్డి కుటుంబం కన్ను పడిందట. ఇంకేముంది సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి.. తనకు సన్నిహితుడిగానే కాకుండా తనతో వ్యాపార భాగస్వామిగా ఉన్న లవకుమార్ రెడ్డిని రంగంలోకి దించేశారట. బాక్సైట్ ఖనిజాలు ఉన్న అటవీ ప్రాంతాన్ని గుర్తించిన వీరిద్దరూ… ఆ ప్రాంతం నుంచి వాహనాల రాకపోకలకు ఏకంగా 14 కిలో మీటర్ల మేర అడవులను నరికేసి దారిని ఏర్పాటు చేయించారట. అంతటితో ఆగని విక్రాంత్ రెడ్డి.. గిరిజనులను మచ్చిక చేసుకునేందుకు లవకుమార్ రెడ్డిని రంగంలోకి దింపగా.. ఓ గిరిజనుడితో లవకుమార్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. 15 ఏళ్లలో రూ.15 వేల కోట్ల మేర లాభం దక్కేలా బాక్సైట్ మైనింగ్ ను చేపడుతున్నట్లుగా సదరు గిరిజనుడితో ఆయన చెప్పారు. ఈ విషయంతో పాటు లవకుమార్ రెడ్డి పలు కీలక విషయాలు.. అదే ఫ్లోలో చెప్పుకుపోయారు. ఎలా బయటకు వచ్చిందో గానీ.. ఈ వీడియో ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి ఫ్యామిలీని ఈ దందాలోకి లాగడంతో పాటు జగన్ కు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.