దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా రూపొందుతున్న సినిమా ‘విరాటపర్వం’. నక్సలైట్ రవన్న జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. రవన్న పాత్రను రానా పోషించారు. ఈ సినిమా టీజర్ ను ఈరోజు మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదల చేశారు. ఈరోజు సాయంత్రం 5.04 గంటలకు టీజర్ విడుదల చేయనున్నట్లు డబ్బుకొట్టి మరీ ప్రచారం చేస్తున్నట్టు ఓ వీడియో కూడా విడుదల చేశారు.
ఏప్రిల్ 30న ఈ సినిమాని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాట మీద విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అతని భావాలకు ప్రేరేపితురాలై ప్రేమికురాలిగా మారినట్టు సాయిపల్లవి డైలాగ్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ప్రియమైన అరణ్య అంటూ ఆమె అతన్ని సంబోధిస్తుంది. అరణ్య అనే కలం పేరుతో అతను కవిత్వం రాసేవాడని, ఆ కవిత్వం చదివి ఆమె అతని వీరాభిమానిగా మారినట్టు తెలుస్తోంది. ప్రియమణి కూడా నక్సలైటుగా నటించినట్టు టీజర్ చూస్తుంటేనే అర్థమవుతోంది.
ప్రధానంగా ఇందులో సాయిపల్లవి నటించడంతో పాటల పరంగానూ హైప్ క్రియేట్ అయ్యింది. వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యాన్ని పంచుకుంది. ప్రేమ – విప్లవం కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఓ నక్సల్ కు ప్రేమ లాంటి బంధాలు ఉంటాయా? ఉంటే అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? లాంటి అంశాలను ఇందులో దర్శకుడు టచ్ చేసినట్టు కనిపిస్తోంది. భావోద్వేగాలను పండించడంలో వేణు ఊడుగుల దిట్ట అని అతని దర్శకత్వంలో రూపొందిన ‘నీది నాది ఒకే కథ’ సినిమా నిరూపించింది.
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత వేణు ఊడుగుల రెండో సారి తన సత్తా చాటేందుకు ఈ ‘విరాటపర్వం’తో వస్తున్నాడు. అతని చిత్రాల్లో అంతర్గతంగా ఓ సందేశం ఉంటుంది. ఇంతకుముందు తండ్రీ కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ ప్రధానాంశంగా ‘నీది నాది ఒకే కథ’ రూపొందింది. ఇది విప్లవ బాటలో సాగే ఓ యువకుడి జీవితంలో ప్రేమ బంధం ఎలాంటి పరిణామాలకు చోటిచ్చింది అని దర్శకుడు చెప్పదలుచుకున్నట్టు తెలుస్తోంది. చెరుకూరి సుధాకర్ ఈ సినిమాని నిర్మించారు. చాలా కాలం తర్వాత ఓ ఎర్ర సినిమా టీజర్ చూసిన అనుభూతిని ఈ టీజర్ మిగిల్చింది.
Must Read ;- రానా ‘విరాట పర్వం’ రిలీజ్ డేట్ ఖాయం
Happy to launch #VirataParvamTeaser.
It looks raw and realistic. Great storytelling by @venuudugulafilm. My best wishes to @RanaDaggubati and @Sai_Pallavi92.
Good luck to the entire team @SLVCinemasOffl @SureshProdns. https://t.co/hkcQInKwQz— Chiranjeevi Konidela (@KChiruTweets) March 18, 2021