విశాఖ ఉక్కు .. ఆంధ్రుల హక్కు అని నినదించి నేటికి 300 రోజులు!
ఏపీ అంటే కేంద్ర పెద్దలకు ఎంత చిన్నచూపో .. విభజన నాటి నుంచి చూస్తున్నాదే! విభజన చట్టప్రకారం కేంద్రం అందించాల్సిన సాయం, ప్రోత్సహాకాలు, ప్రత్యేక హోదా వంటివి ఎప్పుడో తుంగలో తొక్కింది. కేంద్రం చేతిలో స్వీచ్ అండ్ లైట్ మాదిరిగా ఉన్న జనగ్ రెడ్డి పాలనలో ఏపీలో పెత్తనం సాగిస్తోంది కమలదళం. ఇదే అదునుగా విశాఖ పై కన్నెసింది. ప్రైవేటుపరం చేయాలని స్కేచ్ గీసింది. అంతే అమలు చేసేందుకు అడుగులువేస్తోంది. ఎక్కడ ఆగిందే లేదు. కార్మికులు చేస్తున్న నిరసనలు పట్టవు..! రాష్ట్రంలో ఆదాయం వనరులు లేక ఏ స్థాయిలో ఆర్థికంగా వెనుకడబడుతోంది సోయి ఉండక్కర్లేదా? అని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కార్మిక కమిటీ నిలదీస్తోంది. బుధవారంతో కార్మికుల చేపట్టిన ఉద్యమం 300 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా గాజువాక సెంటర్ లో కార్మికులు మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ఆస్తులను అమ్మే నైతిక హక్కు ప్రభుత్వాలకు లేవని నినదించారు. కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు స్టీల్ ప్లాంట్ ను కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వ చూస్తోందని ఆరోపించారు.
వేడెక్కుతున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం!
300 రోజులు నుంచి కార్మికులు ఉద్యమం చేస్తుంటే …కేంద్రం మరోపక్క కోక్ ఓవెన్ బ్యాటరీ విభాగంలో 3,4 బ్యాటరీల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని కార్మికులు మండిపడ్డారు. పక్కా ప్రణాళికలతోనే విక్రయం ద్వారా ప్లాంట్ మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తుల పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, దీనిని ఎంతమేరకు అంగీకరించే ప్రశక్తే లేదన్నారు. ఉద్యమాన్ని పట్టించుకోకుండా దొడ్డిదారిన అమ్మకానికి పెడితే సహించేది లేదని హెచ్చరించాయి.
Must Read ;- విశాఖ ఉక్కు ..ఆంధ్రుల హక్కు ..! ముగిసిపోయే ‘అథ్యయం’?











