తమిళ యాక్షన్ హీరో, నల్లనయ్య విశాల్ బిఫోర్ లాస్టియర్ ‘అయోగ్య, యాక్షన్’ మూవీస్ తో అలరించాడు. త్వరలో ‘చక్ర’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాడు. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి యం.యస్ .ఆనందన్ దర్శకుడు. ఇంతకు ముందు ఇదే నేపథ్యంలో అభిమన్యుడు సినిమాతో విశాల్ దక్షిణాది ప్రేక్షకుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ అనదగ్గ మరో ఆసక్తికరమైన కథతో ఈ సినిమా రూపొందుతోంది.
నిజానికి ‘చక్ర’ సినిమాని ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు ఊగిసలాడారు. ఒక దశలో ఆ సినిమాను ఆల్మోస్ట్ ఓటీటీలో విడుదల కన్ఫర్మ్ అయిందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే విశాల్ , దర్శక నిర్మాతలు మరోసారి ఆలోచించి ఇప్పుడు థియేటర్స్ విడుదలవైపు మొగ్గుచూపడం ఇటు అభిమానుల్ని, అటు డిస్ట్రిబ్యూటీర్స్ ను ఆనందపరుస్తోంది. శ్రద్దా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఫిబ్రవరి 19న తమిళం తో సహా.. తెలుగు, కన్నడ , మలయాళ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని విశాల్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియచేశాడు. మరి చక్ర ఏ రేంజ్ లో అభిమానుల్ని అలరిస్తుందో చూడాలి.
Must Read ;- మాస్ మహారాజాతో ఢీ కొడుతున్న యాక్షన్ కింగ్
Yes, it’s confirmed…
We have planned to release our action thriller film #Chakra in theatres on February 19th in all 4 South Indian Languages. Going to be a grand release. Looking forward to it… GB— Vishal (@VishalKOfficial) February 1, 2021