ఈమధ్య కాలంలో తెలుగు సినిమా రంగంలో కాపీ అనే పదం సర్వసాధారణం అయిపోయింది. ఏ సినిమా దేనికి కాపీ అన్నది పరిశోధించాలంటే ఎవరికీ సాధ్యం కాదు. కళా తపస్వి కె. విశ్వనాథ్ లాంటి వారు కూడా కాపీ అనే విషయంలో మినహాయింపు ఏమీ లేదు. కాకపోతే ఇంకొకరి కథలు కాపీ కొట్టే బదులు తన కథలనే కాపీకొట్టేవాడాయన. ఇలా చాలా సినిమాల్లో అలాంటి సన్నివేశాలు కనిపిస్తాయి. ఎన్టీ రామారావు హీరోగా సావిత్రి, లక్ష్మి, విజయనిర్మల హీరోయిన్లుగా 1971లో ‘నిండు సంసారం’ అనే సినిమా వచ్చింది.
ఆ సినిమా దర్శకుడు విశ్వనాథ్. ‘నిండు దంపతులు’ సినిమాలో ఎన్. టి. ఆర్, లక్ష్మి బావామరదళ్ళుగా నటించారు. వారిద్దరి మధ్య ఉండే సన్నివేశాలు అన్నిటినీ విశ్వనాథ్ మళ్ళీ ‘స్వయంకృషి’ సినిమాలో చిరంజీవి, సుమలతల మీద యధాతథంగా తీశారు. కళా తపస్వికి సన్నివేశాల కరవు ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. పోనీ.. ‘నిండు దంపతులు’లో సీన్స్ ఏవన్నా మాస్టర్ పీసా అనుకుంటే సాదాసీదాగా ఉంటాయి ఆ సన్నివేశాలు. మరి విశ్వనాథ్ ఎందుకు ఆలా చేశారో ఆయనకి మాత్రమే తెలిసిన సమాధానం.