యూట్యూబ్ వీడియో వైవాతో పాపులర్ అయిన హర్ష ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతని పెళ్లి ఫిక్స్ అయ్యింది. యూట్యూబ్ తో మొదలైన అతని కెరీర్ ఇప్పుడు సినిమా వరకూ చేరింది. కమెడియన్ గా మంచి గుర్తింపు లభించింది. ‘హలో వరల్డ్ మీట్ మీ వరల్డ్’ అంటూ కామెంట్ చేయడమే కాదు ఇక ఆమే తన ప్రపంచం అంటూ ఫొటోలు కూడా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. అతని కాబోయే భార్య పేరు అక్షర.
హర్ష, అక్షర కలిస్తే ఏహెచ్.. అందుకే AH అనే అక్షరాలను బ్యాక్ డ్రాప్ గా పెట్టి తన నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేశాడు. హర్ష ఇంటి పేరు చెముడు. వైవా షార్ట్ ఫిలిమ్ తో పేరు వచ్చాక వైవా హర్షగానే అందరికీ సుపరిచితుడు. ఇటావల వచ్చిన కలర్ ఫొటో చిత్రం అతనికి మంచి పేరు తెచ్చింది. తన దైన కామెడీ స్టయిల్ తో అలరించడం హర్ష ప్రత్యేకత. ‘ఆహా’ ఓటీటీలోనూ హోస్ట్ గా కనిపిస్తుంటాడు. అతనిది పెద్దలు కుదిర్చిన వివాహమా, ప్రేమ వివాహమా అన్నది మాత్రం హర్ష ఎక్కడా ప్రస్తావించలేదు. ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి’ఇదే లాస్ట్ బ్యాచిలర్ సెల్ఫీ’ అంటూ హర్ష కామెంట్ కూడా పెట్టాడు.
Must Read ;- యాంకర్ లాస్య యూట్యూబ్ ఛానెల్ హ్యాక్











