ఐదేళ్ల జగన్ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్ గుర్తును నమ్ముకొంటే అడ్రస్ లేకుండా పోతుందనే భయం వైసీపీ నాయకుల్లో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి పార్టీల్లో చేరికలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య నేతలతో పాటు నియోకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీలో చేర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష ప్రారంభించింది.
విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు సైకిల్ ఎక్కారు. గజపతినగరం అంటే మాజీ మంత్రి.. శాసనమండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ కుటుంబానికి కుంచుకోట. 2019లో బొత్స సోదరుడు అప్పనర్సయ్య ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024లో కూటమి హవాలో కొండపల్లి శ్రీనివాస్ విజయం సాధించారు.
2029లో విజయనగరం జిల్లాలో అత్యధిక సీట్లు గెలచుకోవడం ద్వారా మరోసారి సత్తా చాటుకోవాలనే ఆలోచనలో ఉన్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు సొంత ఇలాకాలో ఎదురు దెబ్బలు తగులున్నాయి. బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లి తర్వాత అదే స్థాయిలో పట్టున్న గజపతినగరంలో కీలకమైన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడటం.. బొత్సకు షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.
జగన్‌తో సహా వైసీపీ పెద్దలంతా మళ్లీ వచ్చేది మనమే అని చెప్పుకొంటున్నారు. కానీ క్షేత్రస్థాయి నాయకులు మాత్రం.. పార్టీ మారడం ద్వారా వైసీపీ మళ్లీ వస్తుందనే నమ్మకం లేదని చెప్పకనే చెబుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ చేయించిన అంతర్గత సర్వేల్లోనూ జగన్ గ్రాఫ్ ఏమాత్రం పెరగడం లేదని తెలుస్తోంది. వలసలు ఇలాగే










