హిందూ దేవాలయాలే లక్ష్యంగా దాడులు ..
జగన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆలయాలపై నిత్యం దాడులు కొనసాగుతున్నాయని పరిపూర్ణానంద స్వామి మండి పడ్డారు. కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహ ప్రతిష్ఠ చేయాలని యత్నించారని, దీనిని బీజేపీ ఏమాత్రం ఒప్పుకొదన్నారు. కేరళ కూర్గ్ లో కొండజాతి గిరిజనులను టిప్పు సుల్తాన్ ఊచకోత కోసిన చరిత్ర మరచిపోలేనిదని ఆయన వివరించారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని పెట్టాలనుకున్న జగన్ రెడ్డి చేస్తున్న ఆలోచన ఎలాంటిదో అర్థమవుతుందన్నారు. పీఎఫ్ఐ ప్రోత్సహంతో హిందువులు 98 శాతం ఉన్న ప్రాంతంలో మసీదు నిర్మించే ప్రయత్నం చేశారన్నారు. ఇటువంటి చర్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుగ్లక్ సుల్తాన్, తుగ్లక్ బాద్ షాలు ఏపీలో తయారవుతున్నారని.. ప్రభుత్వాన్ని దింపి తీరుతామని హెచ్చరించారు. జగన్ కు జైళ్లలో వేయడం ఆనవాయితీ మారిందన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. జైల్ భరో చేసి జైళ్లను నింపేందుకు హిందువులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించిన ప్రతిఒక్కరిపై కేసులు పెట్టెందుకు చూస్తున్నారని, అధికార వైసీపీ చర్యలు తీవ్ర ఆక్షేపనీయమని ఆయన మండిపడ్డారు.