క్రికెట్ తెలిసిన వారందరికీ డేవిడ్ వార్నర్ ఎవరో తెలుసు.. సినిమా తెలిసిన వారికి అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఒకరు ఆటగాడు, ఇంకొకరు మంచి పాటగాడు. కానీ ఆటగాడి నోటి నుంచి పాటగాడి పాటొస్తే దాని అందం వేరే ఉంటుంది. అది డేవిడ్ వార్నర్ రూపంలో నెరవేరడం ఆశ్చర్యమే. అందుకేనేమో నెటిజన్లు వార్నర్ కు పట్టం కట్టారు. ఆస్ట్రేలియా ఆటగాడైన డేవిడ్ వార్నర్ ఆ మధ్య అల్లు అర్జున్ పాటలతో డ్యాన్సులు వేసి సందడి చేసిన విషయం తెలిసిందే.
అతనొక్కడే కాదు అతని భార్య కూడా అతనితో కలిసి ఆడిపాడింది. ‘అల వైకుంఠపురములో’ అల్లు అర్జున్ తన డ్యాన్సులతో ఇరగదీసిన పాటలన్నిటినీ వార్నర్ తన దైన శైలిలో ప్రదర్శించి నెటిజన్ల మనసు కొల్లగొట్టేసిన సంగతి తెలిసిందే. ఆ ఒక్కటే కాదు అనేక తెలుగు సినిమా పాటలను కూడా అతను అలవోకగా నర్తించేశాడు. యూట్యూబ్ లో అతను వేసిన ‘బుట్టబొమ్మ’ పాటకు ఎంతటి స్పందన లభించిందో మాటలతో చెప్పలేం.
దీనికి 450 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తనకు ఇంత స్పందన వచ్చినందుకు కృతజ్ఞతా పూర్వకంగా అల్లు అర్జున్ కు అభినందనలు తెలిపాడు వార్నర్. అదీ అతని సంస్కారం. బుట్టబొమ్మ పాట పోస్టర్ ను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలలో పోస్టు చేయడమే కాకుండా వెలడన్ అల్లు అర్జున్ అని కామెంటు కూడా చేశాడు.
Most Read ;- జిగేలు రాణి బుట్టబొమ్మగా మారి ప్రేరణగా పుట్టిన వేళ











