సినిమా ప్రయాణం ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగుస్తుందో తెలియదు. సినీ నటుల వ్యక్తిగత జీవితం కూడా అంతే. నటి నయనతార వ్యక్తిగత జీవితం ఇప్పటిదాకా ఎన్నో వార్తలు వచ్చాయి. ప్రభుదేవాతో సెటిల్ అయిపోతోందని, శింబుతో పెళ్లి… ఇలా నయన్ పై రకరకాల కథనాలు వచ్చాయి. వీటిని గాసిప్స్ గా వారు కొట్టిపారేస్తారనుకోండి… అది వేరే విషయం. ప్రస్తుతం ఈమె జీవితం ఇప్పుడు విఘ్నేష్ శివన్ దగ్గర ఆగినట్టుంది. ఇంతకీ విఘ్నేష్ ఎవరంటారా? నటుడు, రచయిత, దర్శకుడు… ఇలా ఇతనిలో చాలా కళలు ఉన్నాయి.
మొత్తానికి నయనతార, విఘ్నేష్ ల మధ్య ఎంతో ఘాటు ప్రేమ నడుస్తోంది. ఇద్దరూ చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నారు. తమిళంలో నయనతార ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలే చేస్తోంది. ‘అరం’, ‘డోరా’, ‘కోలమావు కోకిల’, ‘ఐరా’, ‘కొలైయుదిర్‌కాలం’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. విజయ్ సేతుపతి, నయనతార కాంబినేషన్ లో వచ్చిన ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమాకి విఘ్నేష్ దర్శకత్వం వహించాడు. 2015లో విడుదలైంది ఈ సినిమా. తెలుగులో నేనే రౌడీ పేరుతో అనువాదమైంది కూడా. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ అంకురించినట్లు సమాచారం.
నిన్న ఓనమ్ పండగ సందర్భంగా తన ప్రియుడితో కలిసి కొచ్చిలో అడుగుపెట్టింది నయనతార. కేరళీయులకు ఇది పెద్ద పండుగ. ఓనమ్‌ను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు నయన్ చెన్నై నుండి చార్టర్డ్ ప్లైట్ బుక్ చేసుకుని మరీ కొచ్చి వచ్చిందట. ఈ ఇద్దరూ ఫ్లైట్ దిగుతున్న కొన్ని కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. విఘ్నేష్ మంచి రచయత కూడా. తమిళ్ లో అతడు చాలా పాటలు రాశాడు. అతనిలోని కవి నచ్చాడో, దర్శకుడు నచ్చాడో తెలియదుగానీ త్వరలోనే వీరి ప్రేమకు శుభం కార్డు పడనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం నయనతార ‘నెట్రికన్’ అనే సినిమాతో పాటు రజనీకాంత్, శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘అన్నాత్తే’ లోనూ ‘మూకుత్తి అమ్మాన్’ అనే మరో సినిమాలోనూ నటిస్తోంది.
Cochin 🛬 #HappyOnam pic.twitter.com/LXqkJrGSs2
— Nayanthara✨ (@NayantharaU) August 30, 2020