మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘమో తెలుసుకుందాం. తెలుగు నెలల్లో మాఘమాసంకు ఓ ప్రత్యేకత ఉంది. మాఘమాసం నెలరోజులు పవిత్ర స్నానాలు చేయాలని మన రుషులు చెప్పారు. దాన్నే మనం ఆచరిస్తున్నాం. మాఘ పౌర్ణమి రోజు చేసే స్నానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. లక్ష్మీ నారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో పవిత్రమైనది. విద్యాధిదేవత, వాగ్దేవి, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచిమి రోజు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని ‘శ్రీపంచమి’ అంటారు. అంతేకాదు మాఘ అమావాస్య పితృకార్యాల నిర్వహణకు ఎంతో ముఖ్యం.
ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు పదివేల సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రహణకాలాలు, సంక్రమణాలు “పైతృకాలకు” ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు. అయితే, ఆదివారం, అమావాస్య, శ్రవణనక్షత్రం, వ్యతీపాత యోగం అన్నీ ఒకేరోజున కలిసివస్తే దాన్ని “అర్ధోదయ పుణ్యకాలం” అంటారు. అది గ్రహణకాలం కన్నా గొప్పదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా మాఘ అమావాస్య, శతభిష నక్షత్రంలో కూడి ఉంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది. కనుక, ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే, పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమౌతాం.
ఫిబ్రవరి 27న మాఘ పౌర్ణమి
ఫిబ్రవరి 27వ తేదీ మాహా మాఘి. అంటే మాఘ పౌర్ణమి. మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా. నిజానికి మకర సంక్రమణం జరిగింది మొదలు కుంభసంక్రమణం జరిగే వరకు మధ్య ఉండే కాలమే “మాఘమాసం”. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. ఈ యాంత్రిక జీవితంలో వరుస స్నానాలు సాధ్యం కాకపోవచ్చు. కనీసం మాఘపూర్ణిమ రోజైనా నదీస్నానం గానీ, సముద్రస్నానం గానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు.
Also Read ;- డైట్ వర్సస్ వ్యాయామం? బరువు తగ్గేందుకు ఉత్తమమైన మార్గం ఏది?
సముద్ర స్నానమే ఎందుకు చేయాలి?
మహామాఘి రోజు సముద్రస్నానమే ఎందుకు చేయాలో చూద్దాం. సకల నదీ, నదాలు చివరకు సముద్రంలోనే కలుస్తాయి. అందువల్ల సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ప్రతినిత్యం సూర్యకిరణాలవల్ల, ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం పరిమాణం తగ్గదు. అలాగే ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం. సాగరుడు సంతోషప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగర స్నానం చేయాలనీ, అవి కూడా “ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘపూర్ణిమ, వైశాఖ పూర్ణిమ”లలో చేయాలని, ఆలా సాగర స్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
స్నానం ఏ సమయంలో చేయాలి?
సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే స్నానం చేయాలి. ఏమిటి ఈ చాదస్తం అని విసుక్కోవడం చేస్తుంటారు కొందరు. నీటిలో విద్యుచ్చక్తి ఉందని సైన్సు చెబుతోంది. కానీ ఈ సైన్సు పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీస్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు. తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్స్నామయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని, ఔషదీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో ఉండే ఈ అద్భుతశక్తులు.. తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని మన పెద్దలు విధించారు.
మరి ‘నడుము మునిగే వరకూ ఎందుకు మునగాలి? నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి’ అనే సందేహాలు కూడా వస్తుంటాయి. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర జలాల్లో, నదీజలాలలో నిక్షిప్తమై ఉన్న సౌరశక్తి, సోమశక్తులను ఈ నాభి నుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకూ నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో మాఘ పూర్ణిమ స్నానం ముఖ్యమైనది.
Must Read ;- మనిషికి ఎందుకీ తాపత్రయం?
ఈ స్నానానికి ఎలాంటి ఫలం వస్తుంది?
సముద్రం, నదులు అందుబాటులో లేనివారి పరిస్థితి ఏమిటనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. అలాంటి పరిస్థితిలో బావుల దగ్గరగానీ, చెరువుల వద్దగానీ “గంగ, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి” నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి, కర్రలా తేలినా ఫలితం శూన్యం అనే విషయాన్ని అందరూ గమనించాలి. మాఘ పూర్ణిమ స్నానఫలం ఏమిటో చూద్దాం. బావి నీళ్ళతో స్నానం చేస్తే, 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది. సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది.
పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే 9,600 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. సంగమస్థానాలలో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్యస్నానఫలం లభిస్తుంది. గంగానదిలో స్నానం చేస్తే 3 కోట్ల 84 లక్షల సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. ప్రయాగలోని త్రివేణీ సంగమంలో స్నానం చేస్తే … గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరురెట్లు అధికఫలం కలుగుతుంది. సముద్రస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు. మాఘస్నానం చేసిన తరువాత, పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తిచేసుకుని, ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత, దానధర్మాలు చేయాలి. మాఘ మాసంలో నువ్వులకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. వీటినే తిలలు అని కూడా అంటారు. తిలా పాపం తలా పిడికెడు అనే సామెతను మీరు వినే ఉంటారు.
నువ్వులు అంటే సాక్షాత్తు శనీశ్వరుడికి ప్రతిరూపం, వాటిని తాకితేనే కష్టాలు వస్తాయి అనే అపోహ మనలో చాలామందికి ఉంది. అది తప్పు. శ్రీమహావిష్ణువు చెమట బిందువులే ఈ “తిలలు” . తిలలు సాక్షాత్తు విష్ణు స్వరూపాలు. ఇవి ఈశ్వర ప్రతీకాలు కూడా. ఈ మాఘమాసం నెలరోజులూ ఒక వంతు చెక్కరకు, మూడు వంతులు తిలలు కలిపి శ్రీహరికి నివేదన చేసి, అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని శాస్త్రం చెబుతోంది. మాఘ పూర్ణిమరోజు “తిల పాత్రదానం” చేయడం ఎంతో మంచిది.
ఈ దానం ఎలా చేయాలంటే, ఒక రాగి పాత్ర నిండుగా తిలలు పోసి, వాటిపైన శక్తి కొద్దీ సువర్ణం ఉంచి.. మాఘమాసం నెలరోజులూ పవిత్రస్నానాలు చేయాలనీ, ముఖ్యంగా మాఘపూర్ణిమ రోజు సముద్రస్నానం చేయాలని, అందువల్ల ఫలం అధికం అని చెప్పుకున్నాం కదా! పూర్ణిమకు సముద్రస్నానానికి ఏమిటి సంబంధం అనే సందేహం కలుగవచ్చు. ప్రతి పూర్ణిమకు, అమావాస్యకు సముద్రానికి “పోటు” ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష శాస్త్ర రీత్యా పూర్ణిమ తిథినాడు రవి, చంద్రులు ఒకరికొకరు సమసప్తక కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటారు.
Also Read ;- ‘దుర్గమ్మ’ కండిషన్స్ : నది స్నానం కుదర్దు.. గుండు కొట్టరాదు











