ఏంటా రహస్యం? ఎందుకంత కమిట్‌మెంట్?ఇది భయమా, భక్తా.. లేక భయంతో కూడిన గౌరవమా? ఏంటసలు? ఎందుకసలు? ఇలా కేసీఆర్ సార్‌ని అడగాలనుంది. కేంద్రాన్ని ప్రశ్నించడమే తప్పన్నట్లుగా తయారయ్యారు. పసుపు బోర్డు కావొచ్చు.. లేదా ఇంకోటి కావొచ్చు.. బీజేపీ నేతలను తిట్టేది కేవలం కేటీఆర్ లేదంటే హరీష్‌రావు.. ఇతర మంత్రులు అంతే. లోకల్‌గా వాళ్లలో వాళ్లు ఏమైనా అనుకోవచ్చు. కాని కేసీఆర్ సార్ మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు బీజేపీని. ఒకప్పుడు ఫెడరల్ ఫ్రంట్ పెట్టి అంతు చూస్తానన్న ఆ ఫెద్దమనిషి మౌనంగా ఉంటున్నాడు. అభిమానులు అది వ్యూహాత్మక మౌనం అంటున్నారు. ప్రత్యర్ధులు అది భయం అంటున్నారు. ఏది నిజం?
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడొద్దంటూ..
మొన్నటికి మొన్న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని పార్టీ నేతలకు ఆర్డరిచ్చారు. ఆ తర్వాత కొనుగోలు కేంద్రాలను ఎత్తేయమన్నారు. ఆ తర్వాత కేంద్రంతో పనులుంటాయి.. అన్నీ బయటకు చెప్పలేమని పార్టీ వాళ్లతోనే ఓపెన్‌గా చెప్పేశారు. ఇక అప్పటి నుంచి కేంద్రంలోని బీజేపీ గురించి మాట్లాడితే ఒట్టు. మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేటీఆర్ ద్వారా ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాంటి వ్యవహారాలపై బీజేపీని దుమ్ము దులిపించేశారు. తాను మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు.
బంద్ గురించి తెలియదన్నట్లే..
ఇదంతా ఇప్పుడెందుకంటే.. వ్యవసాయచట్టాలు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్‌కు పిలుపిచ్చారు. బీజేపీ మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతిచ్చాయి. ఏపీలో వైసీపీ, టీడీపీ, ఇంకా జనసేన సైతం మద్దతిచ్చింది. కాని తెలంగాణలో టీఆర్ఎస్ మాత్రం బంద్ గురించి తెలియదన్నట్లే వ్యవహరిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దారుణమని.. దాని కోసం పోరాడటానికి అవసరమైతే విశాఖ వెళతామని కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు చెప్పారు. ఇక్కడ అండర్ లైన్ చేసుకోవాల్సింది అవసరమైతే అనే పదానికి. అవును మరి వెళ్తారా ఏంటి? మరి అంత దూకుడుగా స్టేట్ మెంట్ ఇఛ్చి.. ఈ రోజు బంద్‌కు ఎందుకు మద్దతివ్వడం లేదు టీఆర్ఎస్ వారు?
సోనియాగాంధీనే ఫూల్ చేసినోడు..
అంతే. బీజేపీకి వ్యతిరేకంగా .. టీఆర్ఎస్, బీజేపీ ఎన్నికల్లో కొట్టాడుకోవడానికి మాత్రమే మాట్లాడతారు. వేరే టైములో, వేరే విషయాల్లో ఇద్దరూ దొందూ దొందే. ఆ విధంగా ఇద్దరి మధ్య అగ్రిమెంట్ అయిపోయినట్లుంది. రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇద్దరూ తలపడండి.. ఎవరూ గెలిచినా మనోళ్లే అని కేంద్రంలోని బీజేపీ పెద్దలు చెప్పినట్లుంది. అందుకే పగలు తిట్టుకుంటూ.. రాత్రికి ఫోన్లు చేసుకుంటూ టీఆర్ఎస్, బీజేపీ నేతలు కథ నడిపించేస్తున్నారని చెప్పుకుంటున్నారు. మధ్యలో కాంగ్రెస్‌ని ఫినిష్ చేయడమే ఇద్దరి లక్ష్యం. అది జరిగితే.. తర్వాత ఇద్దరి మధ్యలో ఎవరు గెలిస్తే వారిదే అధికారం. కాని ఒకరికొకరు ఫుల్లు కోఆపరేషన్. బీజేపీ అయితే ప్రస్తుతానికి ఇది.. తర్వాత కేసీఆర్‌ను కూడా పడేసి పవర్‌లోకి రావాలనేది ఇన్నర్ ప్లాన్. ఆ మాత్రం తెలియనోడా మన కేసీఆర్.. సోనియాగాంధీనే ఫూల్ చేసినోడు.. వీళ్ల సంగతి చూడడా.. అందుకే ఆయన ప్లాన్‌లో ఆయనున్నాడు.
KCR Silence on BJP – మొత్తం మీద టీఆర్ఎస్, బీజేపీలు కలిసి.. కాంగ్రెస్‌ను నాశనం చేసే పనిలో ఉన్నాయి. ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఇరు పార్టీల కార్యకర్తలను, తెలంగాణ ప్రజలను ఫూల్ చేసే పని కూడా చేస్తున్నాయి.
Must Read ;- మోడీ పేరెత్తితే కేసీఆర్‌కు వణుకు: రేవంత్