మెగా కోడలు ఉపాసన కొణిదెల నిన్న సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి ‘నాట్యం’ అని పేర్కొంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు. నాట్యం అంటే ఒక కథను అందంగా చెప్పడం అంటూ పేర్కొనడమే కాదు శనివారం ఉదయం అదేంటో చెబుతానని పేర్కొన్నారు. ఈ రోజు ఆ సస్పెన్స్ కు తెరదించారు.

ఓ నాట్య తార ఫొటోను ఆమె షేర్ చేశారు. ఆ నాట్య తార పేరు సంధ్యా రాజు. ఓ నాట్య భంగిమతో ఆమె ఇచ్చిన పోజు ఆకట్టుకుంటోంది. ‘నాట్యం’ అనే చిత్రం ద్వారా ఆమె వెండి తెరకు పరిచయమవుతోంది. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ ఫస్ట్ లుక్ మోస్టర్ పోస్టర్ ను ఉపాసన విడుదల చేయడం వెనక ఉద్దేశం ఏమిటో చూడాలి.
Must Read ;- మెగాస్టార్ తో ఆ నలుగురు కెప్టెన్లు











