పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ ఆదిపురుష్. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది రామాయణం స్పూర్తితో రూపొందనుందని తెలిసిందే. అయితే.. ఈ మూవీలో ప్రభాస్ రాముడు పాత్ర పోషించనున్నాడు అని ప్రకటించినప్పుడు రావణుడు పాత్రను ఎవరు చేస్తారో అనుకున్నారు. బాహుబలిలో నటించిన రానా రావణుడు పాత్ర పోషిస్తే బాగుంటుందని కొంత మంది అంటే.. మరి కొంత మంది బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ అయితే బాగుంటుంది అన్నారు.
ఇలా కొంత మంది పేర్లు తెర పైకి వచ్చాయి. ఆఖరికి బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ ను రావణుడి పాత్రకు ఎంపిక చేసారు. ఇదిలా ఉంటే.. రామాయణం అందరికీ తెలిసిందే కదా. మరి.. ఇందులో కొత్తగా ఏం చూపించనున్నారు అనేది ఆసక్తిగా మారింది. అయితే… ఓంరౌత్ కానీ.. ప్రభాస్ కానీ ఈ సినిమా గురించి స్పందించలేదు కానీ.. ఇందులో రావణుడు పాత్ర పోషిస్తున్న సైఫ్ ఆలీఖాన్ మాత్రం ఫస్ట్ టైమ్ రావణుడు పాత్ర గురించి బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
ఇంతకీ… సైఫ్ ఆలీఖాన్ ఏం చెప్పారంటే… డైరెక్టర్ ఓంరౌత్ ఆదిపురుష్ లో రావణుడి పాత్రని కొత్త కోణంలో చూపించబోతున్నాడు. సీతని రావణుడు అపహరించడం అందరికీ తెలిసిందే. అయితే… దీని వెనుకున్న కారణాన్ని సహేతుకంగా చూపించనున్నాడు. అంతే కాకుండా… లంకేశుడు అంటే రాక్షసుడు అనే కోణంలో కాకుండా మానవీయ అంశాలను జోడిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆదిపురుష్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది అని చెప్పారు. సైఫ్ ఆలీఖాన్ ఇలా చెప్పడంతో ఆదిపురుష్ మూవీ పై మరింత ఆసక్తి ఏర్పడిందని చెప్పచ్చు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇటీవల ప్రభాస్ ముంబాయి వెళ్లి కథాచర్చల్లో పాల్గొన్నారు. ఈ మూవీ కోసం వరుసగా ఆరు నెలలు డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. 2021లో ఈ సినిమా స్టార్ట్ కానుంది. 2022 ఆగష్టు 11న ఈ సంచలన చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్ధాయిలో రిలీజ్ చేయనున్నారు. మరి.. ఆదిపురుష్ చరిత్రలో నిలిచేపోయే సినిమా అవుతుందేమో చూడాలి.
Must Read ;- మరో సినిమా అనౌన్స్ చేయనున్న ప్రభాస్.. కన్ ఫ్యూజన్ లో ఫ్యాన్స్.