ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు సాగుతుండగా, ఇన్ని గందరగోళాల మధ్య, ముందస్తు ఎన్నికలు వస్తాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వ్యూహంగా తెలుస్తోంది.
వైఎస్ జగన్ అధ్యక్షతన గత నెలలో మంత్రివర్గం సమావేశమై అమ్మఒడి పథకం పొడిగింపు, జగనన్న విద్యా దీవెన, జగనన్న ఆణిముత్యాలు అవార్డుల ప్రదానం తదితర కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.
కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్ మంత్రులతో దాదాపు గంటపాటు సమావేశమైనట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై మంత్రులతో జగన్ మాట్లాడినట్లు సమాచారం. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని మంత్రులతో చెప్పిన వైఎస్ జగన్, ఉన్నట్లుండి హట్టాతుగా ముందస్తు ఎలెక్షన్స్కి పోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మినీ జమిలి, లోక్సభకు ముందస్తు ఎన్నికలపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. లోక్సభకు ముందస్తు ఎన్నికలు వస్తే తాను కూడా అసెంబ్లీని రద్దు చేస్తానని జగన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు చెప్పినట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
లోక్సభ ఎన్నికల అనంతరం హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభతో పాటు మొత్తం 14 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించాలని కేంద్ర పెద్దలు యోచిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకోసం గడువులోగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఏప్రిల్, మే కంటే ముందుగానే లోక్ సభ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. జనవరి నెలాఖరు నుంచి మార్చి నెలాఖరు వరకు లోక్ సభ, 14 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదంతా ఒక ఎత్తు అయితే, సీఎం జగన్ ముందస్తుకు వెళ్లడానికిగల ప్రధాన కారణం వైసీపీకి ఓటమి భయమా పట్టుకుందని, వైసీపీకి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృశ్య ముందస్తుకెళ్తే వైసీపీ జివచు అనే చిన్న ఆశతోనే సీఎం జగన్ ముందస్తు ఎలక్షన్ పోతున్నారు తెలుస్తోంది, బలంగా పుంజుకున్న ప్రత్యర్థి అయినటువంటి టీడీపీతో ఢీ కొట్టాలంటే ఎత్తులు పై ఎత్తులు వేయాల్సిందే , లేదంటే వైసీపీకి ఓటమి తప్పదు, ఆ భయం కారణంగానే సీఎం జగన్ ముందస్తు ఎలక్షన్ కి వెళ్తున్నారు సమాచారం..!