వాట్సప్… ప్రపంచంలో ఇది తెలియని వారుండరు. నేటితరంలో చిన్నపిల్లలు నుండి పెద్దవాళ్ల వరకు చాలామందికి వాట్సప్ మెసెజ్ తోనే రోజు మొదలవుతుందనేది అక్షరసత్యం. వాట్సప్ కేవలం కమ్యూనికేషన్ కే అనుకుంటే మీరు పొరపాటే. ఎంతోమంది దీన్ని తమ బిజినెస్ ప్రచారానికి, వ్యాపారాలని విస్తరించడానికి అభివృద్థి చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. మరి అంతలా మనిషి జీవనంలో ఒక భాగంగా కలిసిపోయింది వాట్సప్ కొన్ని కండీషన్లతో ఫిబ్రవరి 8, 2021 మన ముందుకు రాబోతుంది. అవి ఒప్పుకోకపోతే వాట్సప్ ఉపయోగం ఆపేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తుంది. మరి వాట్సప్ షరతులేంటో తెలుసుకుందాం రండి…
ఇదే మొదటిసారి
2009, ఫిబ్రవరిలో తన ప్రస్థానాన్న మొదలుపెట్టిన వాట్సప్, నేడు ఈ యాప్ లేని మొబైల్ లేదంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి అప్లికేషన్ కైనా కొన్ని షరతులు ఉంటాయి. అందుకు వాట్సప్ మినహాయింపేమీ కాదు. కానీ షరతులు కచ్చితంగా అంగీకరించాలి అని షరతు ఇంతవరకు పెట్టలేదు వాట్సప్. కానీ 2021 ఫిబ్రవరిలో సరికొత్త అప్ డేట్ లో వస్తున్నట్లు వాట్సప్ బ్లాగ్ లో తెలియజేసింది. కానీ, ఈసారి షరతులను కచ్చితంగా అంగీకరించాల్సిందేనని లేకపోతే వాట్సప్ ని తొలగించాల్సిందేనని కచ్చితంగా చెప్తుంది.
కొత్త ఫీచర్లను తెలియజేస్తుంది
వాట్సప్ ప్రవేశపెడుతున్న కొత్త ఫీచర్ ద్వారా అప్లికేషన్ షరతులు, మార్పులు, కొత్త ఫీచర్స్ వంటివి వాట్సప్ స్వయంగా వినియోగదారులకు అప్లికేషన్ ద్వారా తెలియజేస్తుంది. మరి ఈ సరికొత్త సౌకర్యాన్ని 2021 లో మన ముందుకు తేబోతుంది. కానీ, దాన్ని పొందాలంటే మీరు వాట్సప్ షరతులను కచ్చితంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుందని కంపెనీ తెలియజేసింది. ఈ మధ్య కాలంలోనే వాట్సప్ సర్చ్, డూడుల్ వాల్ పేపర్స్, డార్క్, నార్మల్ మోడ్, డిసప్పియరింగ్ మెసజెస్, వాట్సప్ పే… ఇలా ఎన్నో ఫీచర్లని వినియోగదారులకు అందించింది. కానీ ఎక్కడా కచ్చితమైన షరతును పెట్టలేదు. కానీ రాబోతున్న షరతును అంగీకరించాల్సిందే అని పేర్కోంది.











