యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న ప్రెస్టేజీయస్ మూవీ ఆర్ఆర్ఆర్. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2021 జనవరి 8న రిలీజ్ చేయనున్నట్టు గతంలో అపిషియల్ గా ప్రకటించారు. సంక్రాంతి అయితే.. కలెక్షన్స్ బాగుంటాయి అని అలా ఫిక్స్ చేశారు. అయితే.. కరోనా రావడంతో అన్ని సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడింది. దీంతో ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడింది.

దీంతో ఆర్ఆర్ఆర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయితే.. రాజమౌళి షూటింగ్ లో స్పీడు పెంచారు. తాజా సమాచారం ప్రకారం.. మార్చి నెలాఖరుకు షూటింగ్ కంప్లీట్ చేయాలనేది జక్కన్న ప్లాన్. పోస్ట్ ప్రొడక్షన్ కి కాస్త ఎక్కువ టైమ్ తీసుకుని.. 2021 దసరాకి ఆర్ఆర్ఆర్ మూవీని రిలీజ్ చేయాలనేది రాజమౌళి ఆలోచన. ఆల్రెడీ రాజమౌళి ఎన్టీఆర్, చరణ్ మరియు మిగిలిన టీమ్ తో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసారట. అయితే.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అంటే.. మార్చి నెలాఖరుకు ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారని సమాచారం.
ఇదిలా ఉంటే.. చరణ్ కి కరోనా రావడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. అయితే.. చరణ్ లేని సన్నివేశాలను ప్రస్తుతం జక్కన్న చిత్రీకరిస్తున్నారు. అయితే.. జక్కన్న 2021 దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు కానీ.. చరణ్ కి కరోనా రావడంతో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందుచేత 2022 సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవ్వచ్చు అని టాక్ కూడా వినిపిస్తుంది. అయితే.. 2021 దసరాకి వస్తుందా..? లేక ప్రచారంలో ఉన్నట్టు 2022 సంక్రాంతికి వస్తుందా..? అంటే.. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాతే ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ వస్తుంది అని చెప్పచ్చు.
Must Read ;- తారక్ తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ సోషల్ మీడియాలో వైరల్











