నందమూరి ఫ్యామిలీని, యన్టీఆర్ నట వారసత్వాన్ని ఒంటరిగా మోస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. జూనియర్ యన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ హీరో అయినప్పటికీ, హరికృష్ణ రెండో భార్యకు పుట్టిన బిడ్డ కావడంతో మనోడికి ఈ ఫ్యామిలిలో అగ్ర తాంబులం దక్కలేదు.
అంతేకాదు జూనియర్ యన్టీఆర్ కెరీర్ కన్సిస్టెంట్ గా కూడా ఉండదు. ప్రస్తుతం యన్టీఆర్ లెగసీని మోస్తున్న బాలయ్ రిటైర్‌మెంట్‌కి దగ్గర్లో ఉన్నాడు, బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని చెబుతున్నారు. గతంలో మోక్షజ్ఞ సినీరంగం ఎంట్రీ గురించి పుకార్లు వచ్చాయి గానీ.. అవన్నీ అప్పుడే చప్పబడిపోయాయి.
ఇండస్ట్రీ లో సూపర్ సీనియర్ హీరోల వారసులంతా నెక్ట్ జెనరేషన్ హీరోలుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంటే బాలయ్య మాత్రం తన నటవారసత్వం ఎవరికి ఇవ్వాలనే డైలమాలో ఉన్నాడు. దీనికి బాలయ్యకు, జూనియర్ యన్టీఆర్ కి పెద్దగా పడకపోవడంతో నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ లో చీలికలు వచ్చేశాయి.
జూనియర్ యన్టీఆర్ తనకంటూ ఓన్ ఫ్యాన్ బేస్ రెడీ చేసుకున్నాడు. ఇక బాలయ్య బాబు ఫ్యాన్స్ జూనియర్ సినిమాలు చూడటం తగ్గించేశారు. దీనికి తోడు బాలయ్యకు కూడా ఇటీవల వరుస ఫ్లాపులు రావడంతో ఫ్యాన్స్ కూడా బాలయ్యను లైట్ తీసుకుంటున్నారనే చెప్పాలి.
బాలయ్య థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఫ్యాన్స్ అంతా బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ తరువాతైనా బాలయ్య తన నటవారసుడిని ప్రకటిస్తారేమో చూడాలి.