యాంకర్ టర్నడ్ హీరో ప్రదీప్ నటించిన సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.? ఈ సినిమాలోని పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ సినిమాలు రికార్డు స్ధాయి వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసాయి. దీంతో ఈ సినిమా పై క్రేజ్ ఏర్పడింది. పాటలు వలే ఈ సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంటుందని.. ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనే టాక్ వచ్చింది. ఈ సంవత్సరంలో మార్చిలో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు. అంతా సెట్ చేసుకున్నారు. రిలీజ్ చేద్దామనుకుంటే.. కరోనా వచ్చింది. అంతే.. సినిమా రిలీజ్ ఆగింది.
ఆతర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థల నుంచి ఈ సినిమాకి భారీ ఆఫర్స్ వచ్చాయి. దీంతో ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.? ఓటీటీలో రిలీజ్ అవుతుంది అనుకున్నారు కానీ.. రిలీజ్ కాలేదు. ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. కరోనా కాస్త తగ్గడంతో థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో క్రిస్మస్ నుంచి సినిమాలను థియేటర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. ముందుగా డిసెంబర్ 25న సాయిధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటరు సినిమాని రిలీజ్ చేస్తున్నారు.
సంక్రాంతికి రవితేజ క్రాక్, రామ్ రెడ్ మూవీలు రిలీజ్ కానున్నాయి. అయితే.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.? సినిమా రిలీజ్ గురించి మాత్రం ప్రదీప్ కానీ, చిత్ర యూనిట్ కానీ స్పందించడం లేదు. దీంతో అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.? లేదా.? అని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రదీప్ హీరోగా నటించిన మొదటి సినిమా కాబట్టి ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేటర్లోనే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారట. సంక్రాంతికి రావాలా.? లేక ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలా.? అనే కన్ ఫ్యూజన్ లో ఉన్నారట. త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Must Read ;- పవన్ రావడం లేదు సరే.. అఖిల్, నితిన్ కి ఏమైంది.?











