ఇటీవలే తన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ తరచుగా తన హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన బికినీ సొగసులతో సముద్ర తీరాన్ని వేడెక్కిస్తూన్న అందాల విందును తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది ఈ అమ్మడు.ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
వాస్తవానికి రకుల్ బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు సరిపడే హాట్ స్టఫ్ ను తన ఇన్ స్టా వేదికనుంచి షేర్ చేస్తూంటుందని టాక్.ఎక్కువగా స్కిన్ షోస్, బికినీ షూట్స్ లాంటివి తన ఇన్ స్టా ఖాతా నుంచి షేర్ చేసి.. కుర్రకారును వెర్రెక్కిస్తూ ఉంటుంది ఈ అందాల తార. తాజాగా మాల్దీవ్స్ విహారానికి వెళ్ళిన రకుల్ ప్రీత్ సింగ్.. అక్కడ తన బికినీ సొగసులతో సముద్ర తీరాన్ని వేడెక్కించేలా అందాల ఆరోబోతతో విందు చేసింది.ఇక దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా రకుల్ లేటెస్ట్ తన ఇన్ స్టా ఖాతా నుంచి షేర్ చేసింది.
ప్రస్తుతం రకుల్ బికినీ అందాల ఆరబోత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లూ కలర్ బికినీలో రకుల్ సాగరతీరాన సాగరకన్యలా.. టాప్ అండ్ బోటమ్ నాజూకు అందాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. అసలే జీరో సైజుతో తీగలా ఉండే రకుల్ ప్రీత్ ఈ పిక్స్ లో మెరుపుతీగలా కనిపిస్తోంది.ఈ వీడియోని చూడడానికి నెటిజన్ లకు రెండు కల్లు చాలడం లేదంటే అతిశయోక్తి కానే కాదని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉంటే ఇటీవల తెలుగులో ఆశించిన విజయాలు దక్కకపోవడంతో రకుల్ బాలీవుడ్ పై కన్నేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఓ అరడజను బాలీవుడ్ చిత్రాలను క్యూ లైన్ లో పెట్టుకొంది. వాటిలో కొన్ని సెట్స్ మీదుంటే. మరికొన్ని టాకీ పార్ట్ పూర్తి చేసుకున్నాయి. ఇంకొన్ని చిత్రాల్ని కూడా ప్లాన్ చేస్తోందని టాక్. అలాగే తమిళంలోనూ రకుల్ పలు చిత్రాల్లో నటిస్తోందట.
మరి ఈ పిక్స్ తో అయినా రకుల్ కి బాలీవుడ్ అగ్ర సంస్థల నుంచి పిలుపొస్తుందేమో వేచి చూడాలి.











