విజయవాడలో అనేక ప్రాంతాలు మునిగిపోయిన వేళ కృష్ణలంక రిటైనింగ్ వాల్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ రీటైనింగ్ వాల్ ను మేమంటే మేమే నిర్మించామని వైసీపీ ఘనంగా చెప్పుకుంటోంది. కానీ, చరిత్ర తెలుసుకోవాలని టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి పడేస్తోంది. ఇంతకీ రిటైనింగ్ వాల్ పనులు ఏ ఏడాదిలో ప్రారంభించారో తెలుసా? టీడీపీ హాయాంలోనే. క్రిష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే కనకదుర్గ వారధి సమీపంలో క్రిష్ణా నదికి ఒక అంచున రీటైనింగ్ వాల్ నిర్మాణం చేయడం వల్ల విజయవాడలోని కృష్ణలంక, రామలింగేశ్వనగర్ తదితర ప్రాంతాలు వరద ముంపు నుంచి బయటపడ్డాయి.
ఈ గోడను టీడీపీ హయాంలోనే సగానికిపైగా పూర్తి చేశారు. మొత్తం 4.7 కిలో మీటర్ల వాల్ నిర్మాణం 3 ఫేజ్‌లలో నిర్మాణం చేయాల్సి ఉంది. మొదటి ఫేజ్ 2.37 కి.మీ. యనమలకుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు రూ.165 కోట్లు, రెండో ఫేజ్ 1.23 కి.మీ. గీతానగర్ కట్ట నుంచి వారధి వరకు రూ.126 కోట్లు, మూడో ఫేజ్ 1.01 కి.మీ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు రూ.110 కోట్లతో టీడీపీ హయాంలో 2016లోనే అంచనాలు తయారు చేయించారు.
అలా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు కూడా మంజూరు చేయించారు. మొదటి దశ 2.37 కిలో మీటర్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలోనే నిర్మాణం చేయించారు. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెండో దశ నిర్మాణ పనులను చాలాకాలం మొదలే పెట్టలేదు. దీంతో టీడీపీ నేతలు ఆందోళనలు చేయడమే కాక, కృష్ణానది ఇసుకతిన్నెలలో 2021లో గద్దె రామ్మోహన్ భారీ ఆందోళన కార్యక్రమం చేశారు. దీంతో దిగి వచ్చిన వైసీపీ సర్కార్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏడాది ముందు హడావిడిగా ఈ వాల్ పనులు మొదలుపెట్టి పూర్తి చేసింది. పనిలో పనిగా అంచనాలను అదనంగా రూ.50 కోట్లు పెంచి నిర్మాణ పనులు చేపట్టారు. రెండు, మూడో దశ పనులు అలా పూర్తి చేశారు.
ఇప్పుడేమో జగన్ ముంపు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా రీటైనింగ్ వాల్ ని సందర్శించారు. అది తమ పుణ్యమే అంటూ ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఈ రీటైనింగ్ వాల్ నీ వల్లే అయింది అన్నా.. అంటూ అక్కడి జనం చెప్పినట్లుగా సాక్షి మీడియాలో ఊదరగొట్టారు. కానీ, జగన్ పట్టించుకోని ఆ వాల్ టీడీపీ ఆందోళనల కారణంగానే మళ్లీ పట్టాలకెక్కింది.