నందమూరి నటసింహం బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. టైటిల్ విషయానికి వస్తే.. ‘సింహా, లెజెండ్’ చిత్రాల లాగానే పవర్ ఫుల్ గా ఉండేలా ఎలాంటి టైటిల్ పెడతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని టైటిల్స్ ప్రచారంలోకి వచ్చినప్పటికీ.. ఏ టైటిల్ కన్ ఫర్మ్ చేయలేదు. తాజాగా ‘మోనార్క్’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలిసింది. ఈ మూవీ స్టార్ట్ చేయడం.. రెండు షెడ్యూల్స్ జరగడం జరిగింది కానీ.. విలన్ ఎవరు అనేది మాత్రం ఖరారు కాలేదు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ యంగ్ హీరో పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం యువ హీరో నిఖిల్ ని సంప్రదించారట. అయితే.. నిఖిల్ ఈ సినిమాలో నటించేందుకు నో చెప్పినట్టు సమాచారం. నిఖిల్ నో చెప్పడంతో ఆ పాత్ర కోసం ఆది పినిశెట్టి, నారా రోహిత్ పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. యంగ్ హీరో ఫిక్స్ అయితే.. కీలకమైన ఎపిసోడ్ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు విలన్ ఎవరు అనేది కూడా ఫైనల్ కాలేదట. బాలీవుడ్ విలన్ ను రంగంలోకి దింపాలని ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి కానీ.. ఇప్పటి వరకు ఫైనల్ కాలేదని టాక్.
మరో వైపు ఈ సినిమాకి ఆర్ధిక కష్టాలు అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బడ్జెట్ ఎక్కువ అయ్యిందట. ఈ సినిమాకి ముందు నుంచి కష్టాలే. మరి.. అన్ని అడ్డంకులను దాటుకుని సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు రావాలి అనుకుంటుంది. మరి.. ఈ సినిమాలో నటించే యంగ్ హీరో, విలన్ కు సంబంధించి త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.