– సీఐడీ వెనకడుగు వేసిందా..??
– జాతీయ స్థాయిలో పాపులారిటీ తీసుకురావడం ఇష్టం లేదా..??
ఎలాంటి ఆధారాల్లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత
చంద్రబాబును అరెస్ట్ చేయించిన జగన్ ఆ తప్పును సరిదిద్దుకునేందుకు తప్పుమీద తప్పు
చేసుకుంటూ పోతున్నాడు. ఎలాగైనా తాను చేసింది కరెక్టే అనిచెప్పేందుకు అధికార వైఎస్సార్సీపీ నానా
తంటాలూ పడుతూనే ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అంటూ కొత్త వాదనను తెరమీదకు తెచ్చింది. అందులో
యువ నేత నారా లోకేశ్ ను ఇరికించి తిప్పలుపెట్టాని ప్లాన్ చేసింది. అయితే చంద్రబాబు అరెస్ట్ తో వైఎస్సార్సీపీకి ఊహించని రీతిలో షాక్ ఎదురైంది. సీఎం జగన్ పై కూడా జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శల వెల్లువెత్తాయి. చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్ తర్వాత అధికార పార్టీ ఊహించని పరిణామం ఇది. అనేక మంది జాతీయ నేతలు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ ఆయనకు మద్దతు పలుకుతుంటే జగన్ బ్యాచ్ లో భయం మొదలైంది.
ఈ నేపథ్యంలో యువ నేత నారా లోకేశ్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పటం ఢిల్లీలో పలువురు సీనియర్
పొలిటిషియన్లు కలిస మద్దతు సంపాదిండంతో అధికార పార్టీ నేతలకు నిద్ర పట్టలేదు. చంద్రబాబును
జైల్లో పెట్టించాం కదా … అని సంబంరపడిపోతున్న వైఎస్సార్సీపీ నేతలకు నారా లోకేశ్ షాక్ మీద షాకులిస్తూ ఢిల్లీ గడప తొక్కటంతో జగన్ వర్గం నివ్వెర పోయింది. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ ఢిల్లీలో లో పలు జాతీయ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అవినీతిపై ఆధారాలు ప్రశ్నించి లోకేశ్ అగ్రనేతలను సైతం ఆశ్చర్యపరిచాడు. అదే ప్రశ్నలు సీబీఐకి కూడా వేయడంతో ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లోనూ ఓవరాక్షన్ తో చేసి లోకేశ్‌ను అరెస్ట్ చేయిద్దామనుకున్న జగన్ ప్రభుత్వం ఆలోచనకు బ్రేకులేసేలా చేంది. లోకేశ్ కనపడటం లేదంటూ తమ సొంత మీడియా చానెళ్ల ద్వారా ప్రచారం చేయించి నవ్వులపాలైంది కూడా.
చంద్రబాబు అరెస్ట్‌తో అందరి చూపూ నారా లోకేశ్ పై పడింది. అందుకు తగ్గట్టే తండ్రికి తగ్గ తనయుడు అనిపించేలా లోకేశ్ మార్క్ పాలిటిక్స్ ప్రదర్శించారు. జగన్ పార్టీ ఎత్తులు చిత్తు చేస్తూ ఢిల్లీలో నారా లోకేశ్ ఓ వైపు తండ్రి చంద్రబాబు అరెస్ట్ పై ఢిల్లీ పెద్దల ముందు నిరసన తెలపడంతో పాటు జగన్ ప్రభుత్వ కుట్రలను ఎండగట్టడంలో సక్సెస్ అయ్యారు. ఢిల్లీ పర్యటనతో లోకేశ్ పాపులారిటీ అనూహ్యంగా అమాంతం పెరిగిపోవడం వైసీపీ నేతలు కలలో కూడా ఊహించలేదు. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ తో తలబొప్పికట్టిన
జగన్ కు ఢిల్లీ పర్యటనలో లోకేశ్ పాపులారిటీ పెరిగిపోవటం మింగుడుపడలేదు. జాతీయ రాజకీయాల్లో తలపండిపోయిన అనుభవం చంద్రబాబుకు ఉంది. ఆ అనుభవాన్ని ఏ మాత్రం అంచనా వేయని జగన్ అండ్ కో లోకేశ్ ఢిల్లీ టూర్ తర్వాత సీన్ రివర్సవడంతో వ్యూహం మార్చింది. చంద్రబాబును అరెస్ట్ చేయించి ఇప్పటికే అప్పదిష్టను మూటగట్టుకుని కిందా మీదా పడుతుతున్న జగన్ కు లోకేశ్ ను ఢిల్లీ అరెస్ట్ చేయిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అంచనా వేసింది. లోకేశ్ పాపులారిటీ ఇంకా పెరిగితే
తమకు దెబ్బ మీద దెబ్బ తగులుతుదంటని ఓ నిర్ణయానికొచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ కు నోటీసులతో సరిపెట్టింది.











