బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి ఇప్పుడు హాట్ టాపిక్. ఆమెను కావాలనే అర్ధాంతరంగా ఎలిమినేట్ చేశారని, ఆమె హౌస్‌లో ఉంటే ఆట స్వరూపాన్ని మార్చేస్తుందని అందుకే ఓట్లు పడినా ఆమెను ఎలిమినేట్ చేశారని ఆమె మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజంగానే దేవి బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే షోకే డేంజర్ అనుకున్నారా? ఈ డేరింగ్ లేడీని భరించడం కష్టం అనుకున్నారా? అసలేమైంది?? దేవి ఎలిమినేషన్‌కి కారణం ఏంటో ఆమె మాటల్లోనే
‘‘నాకు నమ్మకం ఉంది, మనం నిజాయితీగా ఉన్నప్పుడు మనం ఏంటో మొదట్లో తెలియదు కాని తరువాత తెలుస్తుంది. మొదటి వారంలో నాపై విపరీతమైన నెగిటివిటీ వచ్చింది కాని తరువాత నేనేంటో తెలుసుకున్నారు. ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని చెప్పితే అలా చేయడం నాకు రాదు. నేను ఎలా ఉంటానో అలాగే ఉంటా. బిగ్ బాస్ హౌస్‌లో కూడా నేను నాలాగే ఉన్నా. బిగ్ బాస్ హౌస్‌లో డ్రామా ఉంటుందని నాకు తెలియదు. ఎందుకంటే నేను బిగ్ బాస్ చూసిన విధానం కూడా డైరెక్ట్‌గా మాట్లాడేయొచ్చు.. ఏదన్నా చెప్పొచ్చు అనే అనుకున్నా. ఆ కోణంలోనే నేను హౌస్‌లో ఉన్నా. దేవి నాగవల్లి హౌస్‌లో ఉంటే గేమ్ ఫ్లో బ్రేక్ అవుతుంది.
దేవి లోపల ఉంటే వాళ్లు అనుకున్నట్టుగా ఆట సాగనియ్యదు. వేరే కంటెస్టెంట్లను కూడా ప్రభావితం చేస్తుంది అని వాళ్లు అనుకుని ఉండవచ్చు. ఓటింగ్ తక్కువ వచ్చిందని వాళ్లు నాకు చెప్పారు. నేను బయటకు వచ్చిన తరువాత నాకు చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయని చాలా మంది చెప్తున్నారు. నాకంటే వెనుక చాలా మంది ఉన్నారు. కాని వాళ్లని ఎలిమినేట్ చేయకుండా నన్ను ఎలిమినేట్ చేయడం షాకింగ్‌గా ఉంది. నేను నమ్మిన షో.. నన్ను ఇలా చేస్తుందా?? ఓట్లు వచ్చినా తక్కువ వచ్చాయని అంటారా?? లేదంటే నిజంగానే ఓట్లు రాలేదా? అనే కన్ఫ్యూజన్లో ఉండిపోయా.
నాకంటే మెహబూబ్‌కి తక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు.. నా వల్ల స్క్రిప్ట్ మారిపోతుంది కాబట్టి.. నా వల్ల వాళ్లు అనుకున్న గేమ్ ప్లాన్ రావడం లేదు కాబట్టి.. ఇలా జరిగి ఉండవచ్చు. నేను బిగ్ బాస్‌కి వెళ్లక ముందు నన్ను ట్రోల్ చేసేవారు. వాటిని చూసి నవ్వుకునేదాన్ని. బోర్ కొట్టినప్పుడు వాటిని చూసి ఎంజాయ్ చేసేదాన్ని. బిగ్ బాస్‌కి వెళ్లడం కాదు అక్కడ నుంచి బయటకు ఏ ఇమేజ్‌తో వచ్చారు అనేది ముఖ్యం. చాలామంది నా ఎలిమినేషన్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. నా బాధ మీ వరకూ చేరినందుకు చాలా థాంక్స్. నేను విన్ అయినట్టుగానే భావిస్తున్నా’’ అంటూ చెప్పుకొచ్చారు దేవి.