మోటారు వెహికల్ చట్టం కఠినంగా అమలు చేస్తూ చలాన్లు విధిస్తున్నా, ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నా వాహన చోదకులు పెడచెవిన పెడుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులను దారిలో పెట్టడానికి చెన్నై ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధన అమలు చేయనున్నారు. హెల్మెట్ ధరించక పోయినా, సీటు బెల్టు పెట్టుకోకపోయినా మీ వాహనాల్లో ఏ బంకు వారు పెట్రోలు, డీజిల్ నింపరు. ఈ విషయాన్ని సూచిస్తూ అన్ని బంకుల్లో బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. అంతేగాక ఈ నిబంధన ఖచ్చితంగా అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు అన్ని బంకులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో చెన్నైలో మీ వాహనంలో ఫ్యూయల్ నింపాలంటే ఈ నిబంధన పాటించక తప్పదు.
ఏపీలో అక్వా కారిడార్.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్..
ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...











