చిన్న చిన్న మార్పులతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకురావచ్చని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. దేశంలోని మిగిలిన ఫ్యాక్టరీల కంటే విశాఖ ఉక్కును భిన్నంగా చూడాలన్నారు. నష్టాల్లో ఉందన్న కారణంతో దీన్ని ప్రవేటీకరణ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఫ్యాక్టరీని లాభాల్లోకి తెచ్చేందుకు నిపుణుల సలహాలతో కూడిన పత్రాన్ని రూపొందించి కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు.
కొనసాగుతున్న రిలే దీక్షలు
మరోవైపు ఫ్యాక్టరీ ప్రవేటీకరణ చేయవద్దంటూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 29వ రోజుకు చేరాయి. టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి , ఇతర నాయకులు దీక్షలకు మద్దతు తెలిపారు.సినీ నటుడు శివాజీ దీక్షా శిబిరాన్నిసందర్శించి మద్దతు తెలిపారు.
Also Read :దశలవారీ ఆందోళన.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయం











