భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. మహిళల సింగిల్స్ గ్రూప్-బిలో గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో సింధు 19-21, 13-21తో రచనోక్ ఇంతనాన్ (ఇండోనేషియా) చేతిలో పరాజయం పాలైంది. సూపర్ ఫామ్‌లో ఉన్న రచనోక్ వరుసగా రెండు గేమ్లలోనూ గెలిచి విజయం సొంతం చేసుకుంది.
శ్రీకాంత్.. నిరాశే మిగిల్చాడు…
ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో గేమ్లోనూ ఓటమి చవిచూశాడు కిదాంబి శ్రీకాంత్. వాంగ్జు చేతిలో 21-19, 9-21,19-21తో ఓడిపోయాడు. తొలి గేమ్లో చూపిన ఆధిపత్యం చివరి వరకు నిలబెట్టుకోలేకపోయాడు శ్రీకాంత్. రెండో సెట్ పూర్తిగా వాంగ్జు చేతిలోకి వెళ్లిపోయింది. మూడో గేమ్లో తీవ్రంగా పోరాడినప్పటికీ
భారత షట్లర్కు నిరాశ తప్పలేదు.
ఆరంభ మ్యాచ్ ల్లోనూ ఓటమే…
పంచ టూర్ ఫైనల్స్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబీ శ్రీకాంత్‌కు ఆరంభ మ్యాచ్‌ల్లోనూ ఓటమే ఎదురైంది. మహిళల సింగిల్స్ గ్రూప్-బీలో ప్రపంచ నంబర్‌వన్ షట్లర్ తై జు యింగ్‌తో తలపడిన మ్యాచ్‌లో సింధు ఓటమిపాలైంది. తొలి గేమ్‌లో 21-19తో తెలుగు తేజం పైచేయి సాధించగా.. రెండో గేమ్‌లో ప్రత్యర్థి 21-12తో విజయం సాధించింది. ఇప్పటివరకు తై జు యింగ్‌తో సింధు 21 మ్యాచ్‌ల్లో తలపడగా 16 సార్లు ఓటమిపాలైంది.
మరోవైపు పురుషుల సింగిల్స్ గ్రూప్-బీలో ప్రపంచ నంబర్-3 ఆటగాడు అండర్స్ అంటోన్సెన్‌తో జరిగిన పోరులో శ్రీకాంత్ 21-15, 16-21, 18-21తో ఓటమిని చవిచూశాడు.