విశాఖపట్నంలో డేటా సెంటర్లను వ్యతిరేకిస్తున్న వైసీపీ పేటీఎం పెయిడ్ ఆర్టిస్టులకు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. డేటా సెంటర్లు వద్దంటున్నారు కదా.. సరే వాటిని రద్దు చేసేసి.. కోళ్లు, మేకలు, గొర్రెలు పెంచుకుందామా.. డిగ్రీలు చదువుకున్న వాళ్లు అక్కడ పని చేస్తారా.. మీ పిల్లలను అలాంటి ఉద్యోగాలకు పంపిస్తారా అంటూ.. అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న వారికి ఇచ్చిపడేశాడు.
చైనా రాజధాని బీజింగ్ నుంచి వీడియో చేసిన ప్రపంచ యాత్రికుడు.. ఒకప్పుడు ఆ నగరంలో గాలి విషంలా ఉండేదనే విషయాన్ని గుర్తు చేశాడు. చైనా ప్రభుత్వం చెట్లు పెంచి.. అడవులను విస్తరించడం ద్వారా కాలుష్యాన్ని కంట్రోల్ చేసిందని.. మన దేశం కూడా చైనాను అనుసరించాలని సూచించాడు. భారతదేశంలో ప్రతి మనిషికి 29 చెట్లు ఉంటే చైనాలో 100 చెట్లు ఉన్నాయని.. వాళ్లు 200 చెట్లకు పెంచే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని.. మన వాళ్లు కూడా డెవలప్మెంట్ అడ్డుకొనే పనులు మానేసి.. చెట్లు నాటాలని నెత్తీ నోరు కొట్టుకొని మరీ చెప్పాడు.
డేటా సెంటర్లు వద్దంటే.. వైజాగ్‌లో పందుల ఫారాలు పెట్టుకొని అందులో పని చేద్దామా అంటూ.. పేటీఎం బ్యాచ్ వాదన ఎంత చెత్తగా ఉందో వెటకారంగా వివరించాడు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ని గ్లోబల్ సౌత్ దేశాలకు డేటా సెంటర్ క్యాపిటల్ చేస్తామని ఆ రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులతో వస్తున్న కంపెనీలకు పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఏపీలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.. వారి ప్రలోభాలకు లొంగిపోయిన కొంతమంది.. మేథావులు, స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఉన్న పేటీఎం పెయిడ్ ఆర్టిస్టులు.. డేటా సెంటర్లకు వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్నారు.
ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేసిన వైసీపీ నాయకులు.. ఇప్పుడు కూడా డెవలప్‌మెంట్‌ని అడ్డుకొనే రాజకీయాలే చేయడం ఏపీ ప్రజల దురదృష్టం. రాష్ట్రంలో ఉద్యోగాలు రాకపోతే.. యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిపోతారు. మిగిలిన వాళ్లు జగన్ హయాంలో ఎంతో గొప్పగా ప్రారంభించిన చికెన్ షాపులు, చేపల దుకాణాల్లో పని చేసుకొని బటన్ పథకాల మీద ఆధారపడి బతకాలనే విధంగా వైసీపీ నాయకుల వాదన ఉంది. ఇదే విషయాన్ని ప్రపంచ యాత్రికుడు నా అన్వేశ్.. వెటకారంగా చెప్పాడు. డేటా సెంటర్లను రద్దు చేసి.. పందుల ఫారాలు పెట్టుకొందామా అని ప్రశ్నించడం ద్వారా వైసీపీ పేటీఎం పెయిడ్ ఆర్టిస్టుల బండారం బయటపెట్టాడు. దేశాలు పట్టుకొని తిరిగే వ్యక్తికి.. సొంత గడ్డ అభివృద్ధిపై ఇంత స్పష్టమైన ఆలోచన ఉంటే.. అదే నేలపై ఉంటున్న ప్రజలు ఇంకెంత ఆలోచించాలి. ఇలాంటి అభివృద్ది నిరోధకుల అసలు అజెండా గుర్తించి వారికి తగిన విధంగా బుద్ది చెప్పకపోతే.. రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి లాగే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.











