ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం భారత్‌లో మొదలైంది. కరోనా నుండి ప్రజలను అనునిత్యం కాపాడుతూ కరోనా ఎదురునిలబడిన.. కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు దేశం మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్ ప్రారంభం సందర్భంగా ప్రధాని దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అంటూ ప్రధాని భావోధ్వేగంగా ప్రసంగాన్ని మొదలుపెట్టారు. కరోనా ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూసింది. అనుకున్న సమయం కంటే ముందుగానే వ్యాక్సిన్ వచ్చేసింది. ఒక్కటి కాదు.. రెండు వ్యాక్సిన్లు సిద్ధమయ్యాయి. ఇవే కాదు, ఇంకా వ్యాక్సిన్స్ రెడీ అవుతున్నాయి. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ల తయారీ కోసం రేయింపవళ్లు కష్టపడుతున్నారు. వారి కష్టం ఫలించి ఒక్కో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రత్యేక పోర్టల్ కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. వ్యాక్సినేషన్ అందుకోవాలనుకునే వారు ‘కోవిన్’ యాప్ ద్వారా తమ పేరును రిజిష్టర్ చేసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకున్నారని నిర్లక్ష్యం వహించకండి. ఎప్పటిలాగే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం మరచిపోకండి. కరోనాపై పోరాటంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. విదేశాల్లో ఒక్కో వ్యాక్సిన్ ధర 5 వేల పైచిలుకే.. పైగా మైనస్ 70 డిగ్రీలలో భద్రపరచాలి. కానీ మనం దేశంలోని టీకా చాలా తక్కువ ధరకే లభిస్తుంది. వ్యాక్సిన్ పొందడానికి హెల్త్ వర్కర్లు మొదటి అర్హులు. ఇంత పెద్ద టీకా కార్యక్రమం చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదు.’
Launch of the #LargestVaccineDrive. Let us defeat COVID-19. https://t.co/FE0TBn4P8I
— Narendra Modi (@narendramodi) January 16, 2021
దేశవ్యాప్త టీకా పంపిణీ
దేశ వ్యాప్తంగా 3006 కేంద్రాల్లో వర్చువల్ పద్ధతిలో వ్యాక్సినేషన్‌ని మోడీ ప్రారంభించారు. మొదటి రోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి చొప్పున 3 లక్షల మందికి అందించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఉదయం 10:30 గంటలకు మొదలైన వ్యాక్సినేషన్, సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ అందించడానికి 700 జిల్లాల్లో లక్షన్నర మందికి ప్రత్యేక శిక్షణ అందించారు. వ్యాక్సిన్ తీసుకున్న 2 వారాల తర్వాత మాత్రమే యాంటీ బాడీస్ ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా.. కరోనా బారిన పడడం కాయమంటున్నారు నిపుణులు.
కర్మాచారికి అరుదైన గౌరవం
తెలంగాణలో 139 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్. ఇవాళ టీకా వేయించుకోనున్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. తొలి టీకాను ఆరోగ్య సిబ్బంది ‘కర్మాచారి’కి అందించనున్నట్లు ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సమయంలో అతని సేవలను గుర్తించి ఈ అరుదైన గౌరవం అందించారు. హైదరాబాద్ గాంధీ అసుపత్రిలో వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం చేసింది ప్రభుత్వం. జీజీహైచ్ టీకా కార్యక్రమాన్ని మంత్రి సుచరిత ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3.15 లక్షల మందికి టీకా అందించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తొలి రోజున 139 కేంద్రాల్లో.. ఒక్కో కేంద్రంలో 30 మందికి వ్యాక్సిన్ ఇవ్వడానికి సన్నహాలు చేశారు. ఈ కేంద్రాలను 1,123కు పెంచడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీలో టీకా పండుగ
ఏపీలో 13 జిల్లాలలో వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ అందించనున్నారు. ప్రతి కేంద్రంలో 100 మందికి టీకా వేసే విధంగా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఏపీలో తొలిరోజు 33,200 మందికి వ్యాక్సిన్ అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా 3,87,983 మంది ఆరోగ్య సిబ్బందికి టీకా అందించబోతుంది ప్రభుత్వం. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా.. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో లబ్దిదారుల పేర్లు నమోదయ్యాయి. 13 జిల్లాలకు 4,76,680 లక్షల డోసులు ఆరోగ్య కేంద్రాలకు చేరుకున్నాయి. రాష్ట్రంలో 1677 కోల్డ్ స్టోరేజ్‌లను ప్రభుత్వం సిద్ధం చేసింది.