వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా విభాగానికి మన తన అనే తేడాలు లేవు. అధినేతకు ఇబ్బంది కలిగించేది ఎవరనేది చూడరు. ఆ విషయం మొన్న వైఎస్ షర్మిల విషయంలోనే తేలిపోయింది. పదే పదే జగన్ ను షర్మిల విమర్శిస్తుండడంతో సాక్షిలో తప్పుడు కథనాలు ప్రచురించడంతో పాటు.. వైసీపీ బూతు సోషల్ మీడియాలో మరో స్థాయిలో విరుచుకుపడింది. వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డికి కుమార్తె కాదంటూ.. అడ్డమైన ప్రచారానికి తెగబడింది. అంటే.. జగన్ తల్లిని దారుణంగా కించపర్చినట్లు అయింది. తన బాస్ ను తిట్టినందుకు వైసీపీ బూతు సోషల్ మీడియా ఎంతకైనా తెగిస్తుందనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
సొంత చెల్లెలు జగన్ ను విమర్శిస్తేనే వైసీపీ బూతు సోషల్ మీడియా ఆ స్థాయిలో దిగజారినట్లు వ్యవహరిస్తే.. ఇంకెవరైనా ఆ పని చేస్తే ఊరుకుంటుందా? తాజాగా #90s వెబ్ సీరిస్తో మంచి పేరు తెచ్చుకున్న మౌళి అనే యువ నటుడిపై వైసీపీ రోత సోషల్ మీడియా గురి పెట్టింది. మౌలి సోషల్ మీడియాలో సెలబ్రిటీ. సెటైర్లు వేస్తూ నవ్వించడం అతని పని. స్టేజ్ ఎక్కితే నలుగుర్ని నవ్వించడంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో రాజధానిని మాయం చేశానని జోక్ వేశాడు. అది అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడమే కాకుండా ట్రెండింగ్ కూడా అయింది. దీంతో వెంటనే వైసీపీ బూతు రోత సోషల్ మీడియా విభాగం తమ బూతులతో రంగంలోకి దిగింది.
కేవలం మౌళిని మాత్రమే నిందించకుండా.. అతని అమ్మా, నాన్నలను కూడా ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో తిట్టడం వైసీపీ సోషల్ మీడియా మాఫియా స్టార్ట్ చేసింది. దీంతో కంగారుపడ్డ మౌళి సారీ చెప్పాల్సి వచ్చింది. దీనిపై ఓ వీడియో కూడా విడుదల చేశారు. తన తల్లిదండ్రులను దీంట్లోకి లాగవద్దని వేడుకున్నారు. తాను ఓ జోక్ మాత్రమే వేశానని.. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పాల్సి వచ్చింది. ప్రజల్ని నవ్వించడమే తన లక్ష్యం అని అన్నారు. మౌళి చేసిన సోషల్ మీడియా ప్రకటనతో వైసీపీ బూతు సోషల్ మాఫియా ఎంతకైనా తెగిస్తుందనడానికి ఇది ఇంకొక ఉదాహరణగా నిలిచింది.
కొద్ది నెలల క్రితం మౌళి ఇదే రాజధాని అంశంపై ఓ షార్ట్ వీడియో చేసిన సంగతి తెలిసిందే. అది కూడా విపరీతంగా వైరల్ అయింది. ఆ సంగతి అటుంచితే.. నిజానికి ఏపీ రాజధాని ఎక్కడుందని వైసీపీ నేతల్ని అడిగినా చెప్పలేని పరిస్థితి. వైసీపీ ప్రభుత్వమే ఉంటే.. భవిష్యత్తులో కూడా దానిపై స్పష్టత ఉండదు. ఉన్న నిజాన్ని ఇలా సరదాగా చెప్తే వైసీపీకి ఎక్కడ లేదని రోషం పొడుచుకొని వస్తుంటుంది. అందుకే ఏమీ చేయలేక వైఎస్ఆర్ సీపీ తన సోషల్ మీడియాను ఉసిగొల్పుతుంటుంది. ఎదురుదాడి అంటే బూతులే అన్నట్లుగా వ్యవహరిస్తుంటుంది.