అన్నీ ముందే తెలుసు. అయినా వారు రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం.. అదే దేవుడి స్క్రిప్ట్ ప్రకారం స్క్రీన్ ప్లే నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి వారి డ్రామాలను జనం నమ్మి మోసపోతారో.. లేక నిజాలను గమనించి వారికి బుద్ధి చెబుతారో చూడాల్సిందే. వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నలు వేయటం.. దానికి బీజేపీ మంత్రులు సూటిగా సుత్తి లేకుండా జవాబు చెప్పడం.. అది చూసి మనమంతా గుండెలు బాదుకోవడం .. కామనై పోయింది. స్టీల్ ప్లాంట్, పోలవరం రెండు విషయాల్లోనూ ఇలాగే జరిగింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అయితే వైసీపీ ఎంపీలు వారే ప్రశ్నలడిగి.. వారికే ఇబ్బందికరమైన సమాధానాలు చెప్పించుకుని సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని కామెంట్ చేశారు.
జనాన్ని మెంటల్‌గా ప్రిపేర్ చేయడానికేనా..
అయితే జాగ్రత్తగా గమనిస్తే.. ఇదంతా వైసీపీ ఏదో తెలియక అమాయకత్వంతో చేస్తుందనుకోవడం పొరపాటు. అంతా తెలిసే.. ఇలా ప్రశ్నలు వేసి.. కేంద్రంతో సమాధానాలు చెప్పించి.. జనాన్ని మెంటల్‌గా ప్రిపేర్ చేయడంతో పాటు.. అంతా బీజేపీయే చేస్తోందని.. తాము మాత్రం నిజాయితీగా ఉన్నామని చెప్పుకోవడానికేనని తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఏడాది క్రితమే ఆ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్న వేస్తే.. కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు చర్చలు జరుగుతున్నాయని.. పోస్కోతో ఒప్పందం జరుగుతుందని చెప్పింది. కాని ఏడాది తర్వాత జగన్ అలాంటిదేమీ లేదని బుకాయించారు. ఎంపీ విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ తప్పదని చెప్పారు. దీంతో విశాఖలో ఆగ్రహావేశాలు మిన్నంటాయి. పైగా విజయసాయిరెడ్డి సైతం ఉద్యమం చేస్తానని పాదయాత్ర చేయడం.. మరో విచిత్రం.
లేటెస్టుగా కూడా..
లేటెస్టుగా కూడా ఆ పార్టీ ఎంపీలు అడిగిన పశ్నలకు.. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వంద శాతం అని.. పైగా ప్రైవేటు కంపెనీలు తీసుకోకపోతే మూసేస్తామని కూడా కేంద్రం చెప్పింది. మరో సందర్భంలో పోలవరంకు అదనపు నిధులు లేవని కేంద్రం చెప్పేసింది. ఇది కూడా వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానమే.ఇవన్నీ చూస్తుంటే.. వైసీపీ నేరుగా బీజేపీని విమర్శించదు. ఏం లేదన్నట్లే ప్రవర్తిస్తోంది. ఇంకా ఏదో ప్రయత్నిస్తున్నట్లు బిల్డప్ ఇస్తోంది. మరోవైపు పార్లమెంట్లో ప్రశ్నలు వేసి.. కేంద్రంతో నగ్నసత్యాలు చెప్పిస్తోంది. అంటే తాము ప్రజల పక్షం.. బీజేపీయే అంతా ప్రజలకు వ్యతిరేకంగా చేస్తోందని డ్రామా వేయటం.. పైగా స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రతి ప్రాజెక్టు వ్యవహారంలోనూ తమకు కావాల్సిన బెనిఫిట్స్ ను తెలివిగా చేజిక్కించుకోవడం విజయవంతంగా చేస్తోంది వైసీపీ.
మరి, ఈ వ్యవహారాలను ప్రజలు గమనిస్తారో లేదో .. పసిగడతారో లేదో చూడాలి.
Must Read ;- జగన్ లోగుట్టు బయటపెట్టిన సొంత ఎంపీ వేమిరెడ్డి!