ఏపీలో కూటమి సర్కార్ ప్రారంభించిన ఉచిత బస్సు పథకం సక్సెస్ కావడంతో వైసీపీలో భయం మొదలైంది. కూటమి సర్కార్ 6 గ్యారెంటీల్లో ఒక్కొక్కటిగా పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తోంది. మొన్నటి వరకు ఉచిత బస్సు పథకం ఎప్పుడూ అంటూ నానాయాగి చేసిన వైసీపీ నేతలు..ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. ఫ్రీ బస్సు స్కీం సక్సెస్ ఐతే తమను ప్రజలు పట్టించుకోరనే ఆందోళనలో ఉన్నారు. దీంతో ఉచిత బస్సు పథకంపై ఫేక్ ప్రచారం మొదలు పెట్టేశారు. కర్ణాటక, తెలంగాణలో జరిగిన వీడియోలను సోషల్‌మీడియాలో పోస్టు రాక్షాసానందం పొందుతున్నారు.
ఆగస్టు 15న మహిళలకు కూటమి సర్కార్ ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించింది. కర్ణాటక సహా ఉచిత బస్సు అమలవుతున్న రాష్ట్రాల్లో విధివిధానాలు అధ్యయనం చేసిన తర్వాతే ఏపీలో ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడికైనా మహిళలు ఫ్రీగా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. మొత్తం 5 రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. ఐతే చిన్న చిన్న కారణాలను చూపించి వైసీపీ నేతలు ఫ్రీ బస్సు స్కీంపై తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. AC బస్సుల్లో ఫ్రీ ఎందుకు లేదు, పేదలు AC బస్సుల్లో వెళ్లకూడదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక TTDకి చెందిన సప్తగిరి బస్సులో ఎందుకు వెళ్లనివ్వరంటూ అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ఐతే ఈ బస్సులు టీటీడీ అధీనంలో నడుస్తాయి. ఈ విషయం తెలిసికూడా ఉద్దేశపూర్వకంగానే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది.
టీడీపీ నేతలు సైతం వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా వైసీపీ నేతల విమర్శలపై స్పందించిన మహిళా సహకార ఆర్థిక సంస్థ ఛైర్‌పర్సన్ పీతల సుజాత వైసీపీ అధినేత జగన్ సతీమణి భారతిరెడ్డి కూడా
ప్రయాణించొచ్చని చెప్పారు. కానీ ఆమెకు రాష్ట్రంలోని చిరునామాతో ఉన్న ఆధార్ కార్డో, గుర్తింపు కార్డో ఉండాలన్నారు. ఉచిత బస్సు పథకంపై విమర్శలు చేయడం వైకాపా నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. 74% బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణ అవకాశం లభిస్తోంది. వైసీపీ హయాంలో ప్రజలు నరకయాతన పడ్డా











