టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిభేటీ అయ్యారు. నారా లోకేష్ గవర్నర్తో భేటీ అవడంతో వైసీపీ శ్రేణులలో ఒక్కసారిగా ఉలికిపాటు మొదలైందని సమాచారం. అసలు నారా లోకేష్ ఇప్పుడు ఉన్నటుండి గవర్నర్ని కలవడం ఏంటి? అని ఆరా తీయడం మొదలు పెట్టారు వైసీపీ నాయకులూ. నారా లోకేష్ గవర్నర్ భేటీ విషయం ఏంటి అని వైసీపీ నాయకులకు కొత్త టెన్షన్ మొదలైంది. నారా లోకేష్ తీసుకున్తున్నా నిర్ణయాలకు వైసీపీ శ్రేణుల్ని పెద్ షాక్ కి గురిచేస్తున్నాయి అని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ డ్రగ్ హబ్‌గా మారుతోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన లోకేష్.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీఆర్‌ఐ నివేదిక ప్రకారం 2021-22 సంవత్సరంలో దేశంలోనే డ్రగ్స్ సరఫరాలో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఆధారాలతో సహా వివరాలను అందించారు. రాష్ట్రంలో హవాలా లావాదేవీలు ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతోందని సమాచారం. యువత సమాజాన్ని నాశనం చేసే చర్యలను అరికట్టాలని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
గవర్నర్‌తో భేటీ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతల ప్రమేయంతోనే రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందని ఆరోపించారు. అందుకే డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. డ్రగ్స్ ఉత్పత్తి లేదా స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వారిలో వైసీపీ నేతలు చాలా మంది ఉండడం యాదృచ్ఛికం కాదని ఆయన స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా కొండపై అక్రమంగా మాదక ద్రవ్యాల రవాణా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
డీఆర్‌ఐ నివేదిక ప్రకారం 2021-22లో ఒక్క ఏపీలోనే 18 వేల 267.84 కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. కందుకూరు, అనకాపల్లి ప్రాంతాల్లో కూడా పాఠశాల విద్యార్థుల ఉదంతాలు వెలుగులోకి వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ ప్రేరిత నేరాల రేటు ఎక్కువగా ఉందని గవర్నర్‌కు వెల్లడించారు. గత నాలుగేళ్లలో మద్యం మత్తులో యువతులపై యువత వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయని వివరించారు.