ఆంధ్రుల చిరకాల స్వప్నం, నవ్యాంధ్ర కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటేలా రూపుదిద్దుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై మొదటి రోజే కుట్రలు మొదలయ్యాయి. కమర్షియల్ సేవలు ప్రారంభమైన మొదటి రోజే ఈ ఎయిర్‌పోర్టుపై కుట్రలకు తెరలేపింది వైసీపీ. ఎయిర్‌పోర్టుపై ప్రజల్లో గందరగోళం సృష్టించడంతో పాటు ఇమేజ్‌ను దెబ్బతీయాలనే లక్ష్యంతో వైసీపీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.
……………..
ఈ కుట్రలో భాగంగానే..తొలిరోజే ఉద్దేశపూర్వకంగా వివాదాలను సృష్టించే ప్రయత్నాలు జరిగాయి. ఎయిర్‌పోర్టులోకి వచ్చే కమర్షియల్ వెహికల్స్ ఎంట్రీ, వెయిటింగ్ పేరుతో భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ఓ క్యాబ్ డ్రైవర్‌ను ముందు పెట్టి పెద్ద గొడవకు తెరలేపారు. అసలు ట్రిప్ ఛార్జ్ తక్కువగా ఉంటే, కేవలం లోపలికి వచ్చి వెళ్లినందుకు వేలల్లో ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ ప్రచారం చేసి, డ్రైవర్లను రెచ్చగొట్టే ప్రయత్నం వెనుక బలమైన పొలిటికల్ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
……………..
ఇక ఈ స్థానిక వివాదంతో పాటు మరోవైపు ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసేలా శంషాబాద్ నుంచి భోగాపురం బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం ఎయిర్‌పోర్టు వర్గాల్లో కలకలం సృష్టించింది. ఒకే రోజు ఈ రెండు ఘటనలు జరగడం కేవలం యాదృచ్ఛికం కాదని, వైసీపీ వర్గాలు కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేందుకు, ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ విషయంలో అభద్రతాభావాన్ని సృష్టించేందుకు పన్నిన పన్నాగమని స్పష్టమవుతోంది.
……………..
కూటమి ప్రభుత్వం హయాంలో వస్తున్న పెట్టుబడులను, అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల ఆశలను వమ్ము చేసేలా, రాష్ట్ర ఆర్థిక పురోగతికి అడ్డుతగిలేలా పక్కాప్లాన్ ప్రకారం చేసిన ఈ కుట్రలను ప్రజలు, ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరివల్ల కాదని కూటమి నేతలు వైసీపీపై మండిపడుతున్నారు.
ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!
ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...











