నరసరావుపేట టీడీపీ ఇంఛార్జీ చదలవాడపై పోలీసులు దాడి.. పరిస్థితి విషయం!
నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో తెదేపా నాయకులు అరెస్టులు ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నేతల ఫిర్యాదుతో అక్రమ కేసుల పెట్టి, పోలీసులు తెలుగు దేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేసి, చిత్ర హింసలకు గురిచేస్తున్నారని నిరసిస్తూ.. టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. నరసరావుపేట ఇంఛార్జీ చదలవాడ అరవింద్ బాబు నేతృత్వం టీడీపీ నాయకులు కార్యకర్తలు గుంటూరు, కర్నూలు ప్రధాన రహదారిపై బైటాయించి ఆందోళనకు దిగారు. అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రోడ్డుపై భారీ ట్రాఫిక్ ఏర్పడింది. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలపై పోలీసులు జూలం ప్రదర్శించారు. చదలవాడ అరవింద్ బాబును గుంటెలపై పోలీసులు బూటుకాలుతో తన్నారు. దీంతో ఆయన సృహతప్పి పడిపోయారు. దీంతో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రికి అరంవింద్ బాబును తరలించారు.
చదలవాడపై దాడిని ఖండించిన టీడీపీ అధిష్టానం..!
నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో గురువారం రాత్రి వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు మాయం చేశారు. దీంతో వైకాపా నాయకుల ఫిర్యాదు మేరకు జొన్నలగడ్డ గ్రామానికి చెందిన తెదేపా నేతలు అనిల్, రాజేశ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నరసరావుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ లో విచారించకుండా ఎక్కడికో తీసుకెళ్లి విచారిస్తున్నారని తెదేపా నేతలు శనివారం జొన్నలగడ్డలోని గుంటూరు – కర్నూల్ వైపు పోవు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ధర్నా చేస్తున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ తరతించారు. పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య జరిగిన పెనుగులాటలో అరవింద్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చదలవాడ పై జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడులు తీవ్రం ఖండించారు. చదలవాడ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు ఆరా తీశారు. కార్యకర్తల అక్రమ అరెస్ట్ ను ప్రశ్నిస్తే.. అరెస్ట్ చేస్తారా? ఇదేక్కడి సాంప్రదాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత చదలవాడ అరవింద్ బాబు, పార్టీ శ్రేణులపై దాడికి పాల్పడ్డ, వైసీపీ నేతలు, పోలీసులపై కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డీజీపీని చంద్రబాబు డిమాండ్ చేశారు.