నడిరోడ్డుపై సినిపక్కిలో దాడులు ..!
సీఎం జగన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సొంతపార్టీ నేతల్లో పెరుగుతున్న గ్యాప్స్ ను బయటపెడితే .. కొన్నిచోట్ల అధికారపార్టీ కండకావరాన్ని బహిర్గతం చేశాయి! రాయలసీయ, పల్నాడు ప్రాంతంలో అధికారపార్టీ మధ్య ఫ్లెక్సి వివాదంతో మొదలై.. ఆధిపత్య రాజకీయాలను మరోసారి బయటేశాయి. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా నరసరావుపేటలో జగన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రోడ్డుపై వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ బస్టాండ్ సెంటర్ వద్దకు రాగానే వైసీపీ కార్యకర్తలు పలువరు యువకులను కర్రతో చితకబాదారు. పరిగెత్తెస్తూ మరి కొట్టుకుంటూ హల్చల్ చేశారు. మరోవైపు జిల్లాలోని పత్తిపాడు మండలం బోయపాలెంలో టీడీపీ కార్యకర్త వెంకటనారాయణ పై వైసీపీ కార్యకర్తలు దాడిచేశారు. తలపై మద్యంబాటిల్ కొట్టి, తలకు నిప్పంటించారు. ఇలా మంగళవారం గుంటూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు ఫుల్ గా మద్యం సేవించి.. సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడి భయోత్పాతం సృష్టించారు.











