తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓడిపోతే మీ ఎంపీలంతా రాజీనామా చేస్తారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విసిరిన సవాల్ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వీకరించారు. తిరుపతిలో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఓడిపోతే మా ఎంపీలంతా రాజీనామా చేస్తారంటూ మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓడిపోతే ముగ్గురు ఎంపీలతోపాటు నరసాపురం ఎంపీ రఘురామరాజుతో రాజీనామా చేయిస్తారా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.
కరోనా వల్లే జగన్ పర్యటన వాయిదా…
14వ తేదీన తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా సీఎం పర్యటన రద్దు చేసుకున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ ఏపీ ఇంఛార్జి సునీల్ దియోధర్ కు వైసీపీని విమర్శించే హక్కు లేదని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు.
Must Read ;- బాబు పిలుపు… టీడీపీకి ఓటుతో జగన్ అరాచకానికి చరమ గీతం