అధికారం చేతిలో ఉంది. ఫోన్ కొడితే అధికారులు వాళ్లే పరిగెత్తుకుంటూ వస్తారని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ మరోసారి నిరూపించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సైతం గుంటూరులోని వైద్య సిబ్బంది వద్దకు వెళ్లి కరోనా టీకా తీసుకున్నారు. ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్ మాత్రం వైద్య సిబ్బందినే ఇంటికి పిలిపించుకుని కరోనా టీకా వేయించుకున్నారు. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. శంఖవరం పీహెచ్‌సీ వైద్య సిబ్బంది వైసీపీ ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి మరీ టీకా వేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
టీకా నిల్వ చాలా కీలకం..
కరోనా టీకాను మైనస్ 30 డిగ్రీల వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా వికటించే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా టీకా నిల్వకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికి భిన్నంగా వైసీపీ ఎమ్మెల్యే ఇంటి వద్దే కరోనా టీకా తీసుకున్నారు. టీకా సరైన ఉష్ట్రోగ్రతల వద్ద నిల్వ చేయకుండా వినియోగిస్తే వికటించే ప్రమాదం పొంచి ఉంది. ఇవన్నీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే వైద్య సిబ్బందిని ఇంటికి పిలిపించుకుని టీకా వేయించుకోవడం విమర్శలకు తావిస్తోంది.
Must Read ;- వైసీపీ ఎమ్మెల్యేకు అడుగడుగునా అవమానం : మా గ్రామాలకు రావొద్దు!