వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆ పార్టీ నేతలు ఓ రేంజ్లో కీర్తిస్తుంటారు.. కొందరు ఆయనని దేవుడితో పోల్చుతారు.. ఇవే విమర్శలకు దారితీస్తున్నాయి.. గతంలో అసెంబ్లీ సమావేశాలలో జగన్‌ని పలు మతాల దేవుళ్లతో పోల్చుతూ పలువురు ఎమ్ఎల్ఏలు చేసిన భజన విమర్శలకు దారితీసింది. వాటిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు, ట్రోల్స్ వచ్చాయి.. అయినా, వైసీపీ నేతలకి దాహం తీరడం లేదు. జగన్‌ని కీర్తించడానికే వారు మొగ్గుచూపుతున్నారు.
తాజాగా రాజమండ్రి ఎంపీ మారగాని భరత్ మరోసారి జగన్‌ని దేవుడితో పోల్చారు.. ఈ సారి ఆయన జగన్ అంటే విష్ణువు అని, జగన్నాధుడు అంటూ పూరిలో కొలువై ఉన్న విష్ణు మూర్తి రూపం అని, అలాంటి వ్యక్తిపై విమర్శలు చేయకూడదని, ఆయనని అంటే, దేవుడిని అన్నట్లే అని కొత్త భాష్యం చెప్పుకొచ్చారు. మారగాని భరత్ కామెంట్స్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి..
మారగాని భరత్ ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్నారు.. ఆయన ఈ దఫా మరోసారి ఎన్నికలలో ఎంపీగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.. ఉభయ గోదావరి జిల్లాలలో రాబోయే ఎన్నికలలో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ అడ్రస్ గల్లంతవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఇటు, జగన్ కోసం పనిచేస్తోన్న ప్రశాంత్ కిషోర్ టీమ్ ఐ ప్యాక్ సర్వేలలోనూ ఇవే సర్వే ఫలితాలు వెల్లడి అవుతున్నాయని సమాచారం.. ఇదే ప్రస్తుతం వైసీపీ నేతలను కలవరపెడుతోంది..
ఎంపీగా పోటీ చేస్తే ఓటమి ఖాయమని ముందే తెలుసుకున్న మారగాని భరత్.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడాలని చూస్తున్నారట.. లోక్ సభకి పోటీ చేస్తే నామినేషన్‌కి ముందే ఫలితం కళ్ల ముందు కనిపించడంతో ఆయన అసెంబ్లీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారని పార్టీ వర్గాలలో చర్చ నడుస్తోంది.. అందుకే, ఆ పార్టీ అధినేత జగన్‌ని దేవుడితో పోల్చుతూ భజన రాయుడిలా మారిపోయారని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.. ఇప్పటికి అయినా జగన్ దేవుడు… ఆ వైసీపీ భక్తుడిని కరుణిస్తాడా.?? లేదా..?? అనేది చూడాలి..