వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌కి ఊహించని షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుని అక్రమ అరెస్ట్‌తో జైలులో బంధించి, ఇటు విపక్ష పాత్రను కూడా తానే పోషించాలని , ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగకుండా చూసుకోవాలని జగన్ పక్కా ప్లాన్ వేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. ఇటు, నిజం గెలవాలి యాత్రతో నారా భువనేశ్వరి రంగంలోకి దిగిన వెంటనే, వైసీపీ సర్కార్ ఊహించని ఎత్తుగడ వేసింది. సామాజిక సాధికారిక యాత్రతో తన మంత్రులు, ఎమ్‌ఎల్‌ఏలను రంగంలోకి దింపింది.. ఒకేసారి ఇటు ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయలసీమలో ప్రారంభించారు. మొదటిరోజే ఈ సభకు అత్యంత పేలవమైన స్పందన దక్కిందని సోషల్ మీడియాలో పలు పోస్టులు దర్శనం ఇస్తున్నాయి.. ఇదే ఇప్పుడు వైసీపీని కలవరపెడుతోంది.. 2024కి జగన్ నమ్ముకున్న మూడు ప్రధాన అస్త్రాలలో అత్యంత ప్రధానమైన రెండో అస్త్రం విఫలం అయిందని వైసీపీ నేతలే తమ అంతర్గత చర్చలలో అంగీకరిస్తున్నారనే లీకులు వ్యక్తం అవుతున్నాయి..
రాబోయే ఎన్నికలకు జగన్ మూడు అస్త్రాలను ప్రధానంగా నమ్ముకున్నారు.. అందులో మొదటిది…. ప్రాంతీయ వికేంద్రీకరణ.. మూడు ప్రాంతాల అభివృద్ధి, మూడు రాజధానులు.. ఇది జనాలకు సరిగా రీచ్ కాలేకపోయింది.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశాడనే ఫీల్ ప్రజలకు బాగా చేరింది.. దీంతో, మొదటి అస్త్రం డిజాస్టర్‌గా మారిందనే కామెంట్స్ వస్తున్నాయి.. ఇటు మేధావుల నుండి సామాన్య ప్రజల వరకు జగన్.. రాజధాని అంశంలో విఫలం అయ్యాడని, కనీసం రాష్ట్రానికి గుండెకాయలాంటి క్యాపిటల్ లేని రాష్ట్రంలా మార్చాడనే భావన అందరిలోనూ వ్యక్తం అవుతోంది..
జగన్ నమ్ముకున్న ప్రధాన అస్త్రం నెంబర్ 2… సామాజిక సాధికారిక యాత్ర… కులం, మతం చూడం అన్న జగన్ రెడ్డి.. కులాల వారీగా సమాజాన్ని విడగొట్టి… పబ్బం గడుపుకుంటున్నారనే వాదన ఉంది.. అందులో భాగంగానే తాను అనేక కులాలకు న్యాయం చేశానని, సామాజిక సాధికారిక యాత్రను ప్రారంభించాడు.. అయితే, హవా అంతా రెడ్లదే అవడంతో ఇది కూడా అట్టర్ ఫ్లాప్ అనే సంకేతాలు అందుతున్నాయి.. మంత్రులంతా మూడుప్రాంతాలలో దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని భావిస్తున్నా… ప్రజల నుండి ఆదరణ కరువు అయింది..
వైసీపీ సామాజిక సాధికారిక యాత్ర సెకండ్ సీజన్ ప్రారంభమయింది. దీనికి సరైన రెస్పాన్స్ లేదు.. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలు, కనిపిస్తున్నాయి… గతంలోనూ ఈ యాత్రకి అంతగా ప్రజా ఆదరణ లేదు.. అయినా, మొక్కుబడిగా ఈ యాత్రను ప్రారంభిస్తున్నారన్న చర్చ మొదటి నుండి ఉంది.. అయినా ప్రజలను నమ్మించడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయనే వాదన వినిపిస్తోంది..
ఇక, జగన్ నమ్ముకున్న మూడో అస్త్రం.. సంక్షేమం.. పాత పథకాలకే పేర్లు మార్చి ప్రజలను మభ్య పెట్టడం మినహా.. మరేమీ చేయడం లేదనే చర్చ ఉంది.. ఒక్క అమ్మ ఒడి మినహా.. టీడీపీ సర్కారు పథకాలనే అమలు చేస్తున్నాడు.. ఇటు, టీడీపీ అమలు చేసిన ఎన్నో పథకాలను పక్కన పెట్టేశాడు…. మరోవైపు, అభివృద్ధి లేకపోవడంతో సంక్షేమం మేడిపండులా మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..
మొత్తమ్మీద, జగన్ అస్త్రాలు వరసగా ఫెయిల్ అవుతున్నాయనే చర్చ నడుస్తోంది. ఆయన ఏం చేస్తారో చూడాలి..